Balineni Srinivasa Reddy : మైత్రి మూవీస్ కి పెట్టుబడి పెట్టినట్టు నిరూపిస్తే ఆస్తులు రాసిచ్చి, రాజకీయాల నుంచి తప్పకుంటా : ఎమ్మెల్యే బాలినేని

వీరసింహారెడ్డి ఆడియో ఫంక్షన్ కి ఒంగోలులో పర్మిషన్ వస్తే ఆ సి‌నిమాకి తాను పెట్టుబడి పెట్టినట్లు అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఏ సి‌నిమాకైనా తాను, తన వియ్యంకుడు పెట్టుబడి పెట్టానని నిరూపిస్తే రాజకియాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.

Balineni Srinivasa Reddy : మైత్రి మూవీస్ కి పెట్టుబడి పెట్టినట్టు నిరూపిస్తే ఆస్తులు రాసిచ్చి, రాజకీయాల నుంచి తప్పకుంటా : ఎమ్మెల్యే బాలినేని

Balineni Srinivasa Reddy

Updated On : April 23, 2023 / 1:54 PM IST

Balineni Srinivasa Reddy : జనసేన నాయకుడు మూర్తి మతిపోయి మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్ది విమర్శించారు. తన వియ్యంకుడు వైజాగ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే తనకు సంబంధమేంటని ప్రశ్నించారు. మైత్రి మూవీస్ కి తాము పెట్టుబడి పెట్టినట్టు నిరూపిస్తే తన ఆస్తులు రాసిచ్చి రాజకీయాల నుంచి తప్పకుంటానని పవన్ కల్యాణ్ ను సూటిగా ప్రశ్నించారు.

వీరసింహారెడ్డి ఆడియో ఫంక్షన్ కి ఒంగోలులో పర్మిషన్ వస్తే ఆ సి‌నిమాకి తాను పెట్టుబడి పెట్టినట్లు అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఏ సి‌నిమాకైనా తాను, తన వియ్యంకుడు పెట్టుబడి పెట్టానని నిరూపిస్తే రాజకియాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. నిరూపించకలేకపోతే జనసేన నాయకులపై పవన్ కల్యాణ్ చర్యలు తీసుకుంటాడా అని ప్రశ్నించారు.

Balineni Srinivasa Reddy : నీ సంస్కృతి మార్చుకోకపోతే ప్రజలే నీ తాట తీస్తారు.. దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి బాలినేని ఫైర్

మైత్రి మూవిస్ లో పెట్టుబడి తాను పెట్టానో లేదో పవన్ కల్యాణ్ కనుక్కోవచ్చారు. అసత్య ప్రచారాలతో తన మీదికి ఇన్‌కాంటాక్స్ ఉసిగొల్పాలని చూస్తున్నారని ఆరోపించారు. తానేంటో జిల్లా ప్రజాలకు తెలుసన్నారు.  పదే పదే అసత్యాలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. 2002లో కొన్న స్థలానికి ఇప్పుడు కొన్నట్టు లింక్ పెడుతున్నారని పేర్కొన్నారు.

తనపై అసత్య ప్రచారం చేస్తున్న పత్రికపై 10 కోట్ల రూపాయల పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. పవన్ కల్యాణ్ తన నాయకులను అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. మైత్రి మూవీస్ లో పెట్టుబడి పెట్టిన తెలుగుదేశం ఎమ్మెల్యే ని వదిలేసి తన మీద అబాండాలు వేస్తున్నారని మండిపడ్డారు.