Balineni Srinivasa Reddy : నీ సంస్కృతి మార్చుకోకపోతే ప్రజలే నీ తాట తీస్తారు.. దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి బాలినేని ఫైర్

మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి బాలనేని శ్రీనివాస రెడ్డి కామెంట్స్ చేశారు. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు ధౌర్జన్యం చేశారని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అంటున్నారని పేర్కొన్నారు.

Balineni Srinivasa Reddy : నీ సంస్కృతి మార్చుకోకపోతే ప్రజలే నీ తాట తీస్తారు.. దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి బాలినేని ఫైర్

balineni

Updated On : March 14, 2023 / 4:41 PM IST

Balaneni Srinivasa Reddy : మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి బాలనేని శ్రీనివాస రెడ్డి కామెంట్స్ చేశారు. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు ధౌర్జన్యం చేశారని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అంటున్నారని పేర్కొన్నారు. ఏదో ఒక రకంగా బురద జల్లాలనే విధంగా జనార్దన్ మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. తనను దెబ్బ తీసేందుకు సుబ్బారావు గుప్తాకు డబ్బులు ఇచ్చి పురికొల్పాడని ఆరోపించారు. సోమవారం పోలింగ్ కేంద్రాల వద్ద పరిశీలనకు వెళ్తే తనపై టీడీపీలోని ఓ తృతీయ శ్రేణి నాయకుడు చొక్కా విప్పి కాలర్ ఎగరేసి తనను రెచ్చగొట్టేందుకు మీసాలు తిప్పారని పేర్కొన్నారు. తానైతే సహనంతో ఉండగలను కార్యకర్తలు ఉండలేరు కదా అని అన్నారు.

నీలా కుటుంబ సభ్యులపై బూతులు తిట్టించాలనుకుంటే తన వెంట వందల మంది ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులను జిల్లా వ్యాప్తంగా తనతోపాటు అందర్ని ఇబ్బంది పెట్టావని గుర్తు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లో ఉన్న ఇద్దరు నాయకులను పోలీసు అధికారుల అనుమతి లేకుండా చంద్రబాబు పోలీసు అధికారులతో మాట్లాడాడని, దౌర్జన్యం చేసి సిఐని దూషించి బయటకు తీసుకెళ్లాడని పేర్కొన్నారు. నీలా దౌర్జన్య సంస్కృతి మా చరిత్రలో లేదన్నారు. అధికారంలో తాము ఉన్నా కూడా నీవు అదికారంలో ఉన్నట్లు దౌర్జన్యం చేస్తున్నావని చెప్పారు.

Balineni Srinivasa Reddy : అంతు చూస్తా.. సొంత పార్టీ నేతలకు బాలినేని వార్నింగ్

పోలీసుల అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లిన నీ మీద క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. తాను 5సార్లు ఎమ్మెల్యేగా ఉండబట్టే ఒంగోలు ప్రజలు సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారని.. అదే నీవు 5సార్లు గెలిచి ఉంటే ఎంత అరాచకం చేసేవాడివో అని అన్నారు. ముందు నీ సంస్కృతి మార్చుకో లేకపోతే ప్రజలే నీ తాట తీస్తారు అని హెచ్చరించారు. తనను ఒక రౌడీ సంస్కృతి ఉన్న వ్యక్తిగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని.. ఆ సంస్కృతి ఎప్పుడు లేదన్నారు.

తన కారులో వెనుకాల మహిళలను వేసుకుని కారంపొడి పొట్లాలను వెంట పెట్టుకుని వచ్చారని ఆరోపిస్తున్నారు. అది నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని చెప్పారు. పోలీస్టేషన్ నుండి టీడీపీ నేతలను దౌర్జన్యంగా తీసుకెళ్తే పోలీసు అదికారులు మౌనంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైసీపీ కార్యకర్తలపై ఇంకోసారి టీడీపీ దౌర్జన్యం చేస్తే తాను ఊరుకుంటానేమో కానీ, తన కార్యకర్తలు ఊరుకోరని పేర్కొన్నారు.