Chandrababu: వైకాపా ఎమ్మెల్యే అవినీతి గురించి చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్న వైకాపా నాయకుడు: ఆసక్తికర ఘటన

చంద్రబాబు మాట్లాడుతుండగా..గ్రామ సభకు వచ్చిన వైసిపి నాయకుడు..కాజా రాంబాబు..తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు

Chandrababu: వైకాపా ఎమ్మెల్యే అవినీతి గురించి చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్న వైకాపా నాయకుడు: ఆసక్తికర ఘటన

Chandra

Chandrababu: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం కృష్ణాజిల్లా నెక్కలం గొల్లగూడెం గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామ ప్రజల సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అయితే టీడీపీ నేతలు నిర్వహించిన ఈ గ్రామ సభలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గ్రామ సభలో ప్రజలనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతుండగా..గ్రామ సభకు వచ్చిన వైసిపి నాయకుడు..కాజా రాంబాబు..తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. దీంతో చంద్రబాబు నాయుడు రాంబాబుకు మాట్లాడే అవకాశం కల్పించారు.

Also read:Congress Party: సోనియా నివాసంలో 6 గంటల పాటు కాంగ్రెస్ నేతల సమావేశం: పాల్గొన్న ప్రశాంత్ కిషోర్

ఈసందర్భంగా కాజా రాంబాబు మాట్లాడుతూ..నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ తనయుడు స్థానికంగా లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డాడంటూ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన పత్రాలను సైతం రాంబాబు బహిరంగంగా చంద్రబాబుకు అందించారు. తానూ వైకాపా నాయకుడినేనని, వైకాపాలోనే ఉంటూ గ్రామంలో జరిగిన రూ.75 లక్షల అవినీతిపై పోరాడుతున్నానని రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పార్టీ పరంగా వైకాపాలోనే కొనసాగుతానన్న రాంబాబు, ఎమ్మెల్యే మేకా ప్రతాప్ తనయుడు అవినీతి పై పోరాటానికి మద్దతివ్వాలని చంద్రబాబును కోరాడు.

Also read:Minister Kakani : మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

అయితే వైకాపా నాయకుడిగా రాంబాబు, చంద్రబాబును కలవడంపై స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుచెప్పారు. అవినీతి పై రాంబాబు చేసే పోరాటాన్ని పార్టీలకు అతీతంగా చూడాలని శ్రేణులకు నచ్చ చెప్పిన చంద్రబాబు..గ్రామసభలో రాంబాబును అభినదించి తనకు చేతనైన సాయం చేస్తానని మాటిచ్చారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైకాపా ఓ అవినీతి వృక్షమని, తల మొత్తం అవినీతి మయమైనప్పుడు పార్టీలో మొండెం పోరాడినా ఫలితం లేదంటూ దుయ్యబట్టారు.

Also read:Janasena Pawan Kalyan: బురద రాజకీయాలు చేతకాదు, రైతులకు అండగా నిలవడం మా బాధ్యత: పవన్