Ap Assembly: టీడీపీ హయాంలో డేటా చోరీ వాస్తవమే .. శాసనసభకు సభా సంఘం మధ్యంతర నివేదిక

2017-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో డేటా చౌర్యం వ్యవహారం‌లో శాసన‌సభ‌కు మధ్యంతర నివేదికను సభా సంఘం మంగళవారం సమర్పించింది. డేటా చౌర్యం వ్యవహారంపై హౌజ్ కమిటీ రూపొందించిన మధ్యంతర నివేదికను తిరుపతి ఎమ్మెల్యే, పెగాసస్ స్పైవేర్ వ్యహారంపై ఏర్పాటైన సభా సంఘం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి  అసెంబ్లీలో చదివి వినిపించారు.

Ap Assembly: టీడీపీ హయాంలో డేటా చోరీ వాస్తవమే .. శాసనసభకు సభా సంఘం మధ్యంతర నివేదిక

bhumana karunakar reddy

Ap Assembly: 2017-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో డేటా చౌర్యం వ్యవహారం‌లో శాసన‌సభ‌కు మధ్యంతర నివేదికను సభా సంఘం మంగళవారం సమర్పించింది. డేటా చౌర్యం వ్యవహారంపై హౌజ్ కమిటీ రూపొందించిన మధ్యంతర నివేదికను తిరుపతి ఎమ్మెల్యే, పెగాసస్ స్పైవేర్ వ్యహారంపై ఏర్పాటైన సభా సంఘం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి  అసెంబ్లీలో చదివి వినిపించారు. స్టేట్ డేటా సెంటర్‌లో గోప్యం‌గా ఉండాల్సిన సమాచారాన్ని సేవా మిత్ర యాప్‌కు అప్పగించారని అన్నారు. చాలా అంశాలు విచారణ చేసిన తరవాత టీడీపీ ఈ చౌర్యానికి పాల్పడినట్టు గుర్తించామని కరుణాకర్ రెడ్డి తెలిపారు.

CM Jagan : స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్థులకు అందాలి.. పాఠశాల విద్యాశాఖపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

ప్రజల‌కు చెందిన, గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని గత ప్రభుత్వం ప్రైవేటు‌కు అప్పగించిందని, టీడీపీకి ఓటు వేయని వ్యక్తుల వివరాలు తెలుసుకుని వారి ఓట్లను తొలగించేందుకు ఈ యాప్ ద్వారా ప్రయత్నాలు చేశారని అన్నారు. టీడీపీకి ఓటు వేయని వారి ఓట్లు రద్దుచేసే ప్రక్రియకు ఈ యాప్ ద్వారా శ్రీకారం చుట్టారని కరుణాకర్ రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ నాలుగు దఫాలు సభా సంఘం సమావేశమై విచారణ జరిపినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు, శాఖల అధికారుల నుంచి వివరాలు సేకరించామని, మరికొంత మందిని విచారణ చేయాల్సి ఉందని తెలిపారు.

AP CM YS Jagan: అమరావతిపై ఎలాంటి కోపం లేదు: ఏపీ సీఎం జగన్

ప్రస్తుతానికి మధ్యంతర నివేదిక మాత్రమే సభకు సమర్పిస్తున్నామని, రెండు ప్రతులు మాత్రమే సిద్ధం చేశామని, ఒకటికి స్పీకర్‌కు, మరొకటి ప్రభుత్వానికి ఇస్తున్నామని సభాసంఘం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.