Janasena : బీజేపీతో పొత్తు వల్ల జనసేనకు నష్టం తప్ప ఏమాత్రం లాభంలేదు : జనసేన నేత బొలిశెట్టి

బీజేపీతో పొత్తు వల్ల జనసేనకు నష్టం తప్ప ఏమాత్రం లాభంలేదని బీజేపీ చేసే పనుల వల్ల జనసేన పార్టీ మూల్యం చెల్లించుకుంటోందని జనసేన గోదావరి జిల్లాల ఇన్ చార్జ్ బొల్లిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు.

Janasena : బీజేపీతో పొత్తు వల్ల జనసేనకు నష్టం తప్ప ఏమాత్రం లాభంలేదు  : జనసేన నేత బొలిశెట్టి

Janasena Leader Bolishetti Srinivas'

Janasena :  ఏపీలో బీజేపీ-జనసేన పార్టీల మధ్య దూరం మరింతగా పెరుగుతోందా? ఈ రెండు పార్టీల మధ్యా వచ్చే ఎన్నికల్లో పొత్తు లేనట్లేనా? పవన్ ను సీఎం క్యాడెట్ గా బీజేపీ అధిష్టానం ప్రకటించకపోవటంపై జనసేన నేతలు గుర్రుగా ఉన్నారా? అంటే నిజమేననిపిస్తోంది. బీజేపీ చేసే పనులు వల్ల జనసేన పార్టీ మూల్యం చెల్లించుకుంటోందని..బీజేపీ వల్ల జనసేన మైనర్టీ, ఎస్సీ, ఎస్టీలకు దూరమవుతోందని జసేన నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

దీంట్లో భాగంగా జనసేన గోదావరి జిల్లాల ఇన్ చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా జననేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రకటించకపోవటంతో జసనేన నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గోదావరి జిల్లాల జనసేన ఇన్ చార్జ్ బొలిశెట్టి మాట్లాడుతూ జనసేన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా బీజేపీ పట్టించుకోలేదని ఇప్పుడు కూడా అదేతీరుగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. అటువంటి బీజేపీతో తాము పొత్తు పెట్టుకునేది లేదని చెబుతున్నారు.

జనసేన అధినేన పవన్ కళ్యాన్ ను వైసీపీ నేతలు నానా విధాలుగా మాట్లాడినా బీజేపీ నేతలు ఏమాత్రం నోరు మెదరును అని జనసేన నేతలపై వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతున్నా పట్టించుకోరని కనీసం ఖండించరని అటువంటి బీజేపీపై జనసేన పొత్తు పెట్టుకోదని తేల్చి చెప్పారు బొలిశెట్టి శ్రీనివాస్. కానీ బీజేపీతో పొత్తు విషయం గురించి జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఏమాత్రం నోరు విప్పటంలేదు. బీజేపీ నీడ పడి జనసేన తీవ్రంగా నష్టపోతోందని.. కానీ బీజేపీకి తన రాజకీయ లబ్ది కోసం..పవన్ కళ్యాణ్ ఇమేజ్ మాత్రం వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఏపీకి బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కంప్లీట్ చేయటంలేదని..అలాగే విశాఖ ఉక్కుని అమ్మేయటనాకి బీజేపీ ప్రభుత్వం కాచుకుని కూర్చుందని..విభజన చట్టంలోఉన్న హామీలను ఇప్పటివరకు కేంద్రం ప్రభుత్వం నెరవేర్చలేదని.. అటువంటి బీజేపీ వల్ల జనసేన కూడా మాటలు పడాల్సి వస్తోంది అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.