Janasena Alleged : టీటీడీ ఆస్తులు మొత్తం కాజేస్తున్నారు : జనసేన
జగన్ మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని ఎందుకు బదిలీ చేయలేదని ప్రశ్నించారు. టీటీడీలో అక్రమాలు చేయడానికే ధర్మారెడ్డిని కొనసాగిస్తున్నారని విమర్శించారు. ధర్మారెడ్డిని బదిలీ చేయకుంటే అలిపిరిని ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

Janasena
Janasena alleged తిరుమల పుణ్యక్షేత్రంలో ముడు సంవత్సరాలుగా ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదని జనసేన పార్టీ నేతలు అన్నారు. భక్తులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డికి ధర్మారెడ్డికి ఎటువంటి లావాదేవీలు ఉన్నాయన్నారు. ఈ మేరకు జనసేన నేతలు కిరణ్ రాయల్, హరిప్రసాద్, రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి అండతో టీటీడీ ఆస్తులు మొత్తం కాజేస్తున్నారు
జగన్ మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని ఎందుకు బదిలీ చేయలేదని ప్రశ్నించారు. టీటీడీలో అక్రమాలు చేయడానికే ధర్మారెడ్డిని కొనసాగిస్తున్నారని విమర్శించారు. ధర్మారెడ్డిని బదిలీ చేయకుంటే అలిపిరిని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. జగన్ రెడ్డి ధర్మం వైపు ఉన్నారా ధర్మారెడ్డి వైపు ఉన్నారా స్పష్టం చేయాలన్నారు. ధర్మారెడ్డి అక్రమంగా ఈఓ స్థాయి అధికారిగా కొనసాగుతున్నారని విమర్శించారు.
TTD properties : టీటీడీ చరిత్రలో తొలిసారి..తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల
శేఖర్ రెడ్డి దళారీ కాదా? మీకు వియ్యంకుడు అవుతున్నాడని శేఖర్ రెడ్డి దళారీ కాదా అని నిలదీశారు. తిరుమలలో అక్రమంగా తిష్ట వేసిన ధర్మారెడ్డిని దించేవరకు జనసేన పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. ధర్మారెడ్డి అక్రమ నియామకంపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. వివాదాలకు నిలయమైన ధర్మారెడ్డిని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
బదిలీ చేయకుంటే 10న అలిపిరిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ధర్మారెడ్డి కొడుకుతో ఇసుక మాఫియా డాన్ శేఖర్ రెడ్డికి కూతురితో 9న తిరుమలలో ఎంగేజ్ మెంట్ జరుగనుందని చెప్పారు. ధర్మారెడ్డి అంటే ముఖ్యమంత్రి కి భయమా? అని ప్రశ్నించారు. ధర్మారెడ్డిపై అంత ప్రేమ, భయం ఉంటే ఛైర్మెన్ గా నియమించుకోవాలని సూచించారు.