Janasena : సీఎంను చంపుతానంటూ పోస్టు పెట్టిన వ్యక్తితో పార్టీకి సంబంధం లేదన్న జనసేన

ముఖ్యమంత్రిని చంపుతానంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తికి, జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిని జనసేన పార్టీ..

Janasena : సీఎంను చంపుతానంటూ పోస్టు పెట్టిన వ్యక్తితో పార్టీకి సంబంధం లేదన్న జనసేన

Janasena

Janasena : సీఎం జగన్‌ను చంపుతానంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రాజుపాలెపు ఫణి అనే వ్యక్తిని ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసుల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాను జనసేన సానుభూతి పరుడినని, పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని పోలీసుల విచారణలో అతడు చెప్పడం జనసేన వర్గాల్లో కలకలం రేపింది. దీనిపై జనసేన పార్టీ స్పందించింది. సీఎం జగన్‌ను చంపుతానని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తితో జనసేనకు ఎలాంటి సంబంధం లేదని పార్టీ తేల్చి చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. అలాగే, పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేసింది.

Corona Side Effect: కరోనా నుంచి కోలుకున్నాక ఎదురయ్యే సమస్యలు ఇవే..!

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిని జనసేన పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని జనసేన పార్టీ మీడియా విభాగం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రిని చంపుతానంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తికి, జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. హింసను ప్రోత్సహించే, అశాంతిని కలిగించే, అసభ్యకర వ్యాఖ్యానాలు ఉండే పోస్టులను పార్టీ ఎప్పుడూ ఖండిస్తుందని వివరించింది. పార్టీ సానుభూతిపరుడు, పార్టీ అధ్యక్షుల వారి అభిమాని అనే ముసుగులో తప్పుడు పోస్టులు చేసే వారి పట్ల జనసేన నేతలు, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ మీడియా విభాగం సూచించింది.

సోషల్ మీడియాలో హుందాగా వ్యవహరించాలని, వాస్తవిక విశ్లేషణా దృక్పథంతో, ఆలోచనాత్మకంగా, చైతన్యపరిచే విధంగా పోస్టులు ఉండాలని జనసేన పార్టీ కోరుకుంటుందని తేల్చి చెప్పింది.

ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక గుంటూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎంను చంపుతానంటూ రాజుపాలెపు ఫణి అనే జనసేన మద్దతుదారుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని ఆమె వెల్లడించారు. సీఎంపై బెదిరింపులకు పాల్పడిన ఆ జనసేన మద్దతుదారుడ్ని అరెస్ట్ చేశామని తెలిపారు. మానవ బాంబుగా మారి సీఎంను హతమార్చుతానని ట్విట్టర్ లో పోస్టు చేశాడని, తర్వాత ఆ పోస్టును డిలీట్ చేశాడని ఎస్పీ రాధిక వివరించారు. తమ విచారణలో తాను పవన్ అభిమానినని, జనసేన మద్దతుదారుడినని ఫణి చెప్పాడని ఎస్పీ రాధిక చెప్పారు.

Crime News: “పుష్ప లాగా ఎదగాలని” హంతకులుగా మారిన మైనర్లు

అతడు తన అసలు పేరుకు బదులు కన్నా భాయ్ అనే అకౌంట్ ద్వారా పోస్టులు చేశాడని ఆమె వివరించారు. అనంతరం ఫోన్ స్విచాఫ్ చేసి హైదరాబాద్ వెళ్లిపోయాడని తెలిపారు. టెక్నాలజీ సాయంతో ఫణిని అరెస్ట్ చేశామన్నారు. చట్టవిరుద్ధంగా పోస్టులు పెట్టే వారిపై చర్యలు ఉంటాయని ఎస్పీ రాధిక వార్నింగ్ ఇచ్చారు.