Justice Dhiraj Singh Thakur : ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం
జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 1964 ఏప్రిల్ 24న జన్మించారు. 1989 అక్టోబర్ 18న ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు.

Justice Dhiraj Singh Thakur
Andhra Pradesh High Court : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లిలోని కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. జమ్మూకాశ్మీర్ కు చెందిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదోన్నతిపై సీజేగా ఏపీ హైకోర్టుకు వచ్చారు.
జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 1964 ఏప్రిల్ 24న జన్మించారు. 1989 అక్టోబర్ 18న ఢిల్లీ, జమ్మూకాశ్మీర్
బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2013 మార్చి 8న జమ్మూకాశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022జూన్ 10న బాంబే హైకోర్టుకు బదిలీ అయి సేవలు అందించారు.
ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది జడ్జీలు ఉండగా సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ రాకతో న్యాయమూర్తుల సంఖ్య 38కి చేరింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడంతో మే 19 నుంచి ఖాళీ అయిన స్థానం భర్తీ చేసేందుకు కొలీజియం జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేరును సిఫార్సు చేసింది.
గత ఫిబ్రవరి9న కొలీజియం ఆయనను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సిఫార్సు చేసినా.. అది ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉండటంతో కొలీజియం ఆ సిఫార్సును రద్దు చేసి జులై 5న ధీరజ్ సింగ్ ఠాకూర్ ను ఏపీ హైకోర్టు సీజేగా నియమించాలని నిర్ణయించింది.