KA Paul: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. చంద్రబాబు పాత్రపై కేఏ పాల్ అనుమానాలు

KA Paul on YS Vivekananda Reddy Murder Case Probe: వివేకానందరెడ్డి హత్య కేసులో వివేకా కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు పాత్రపైనా దర్యాపు జరగాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు.

KA Paul: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. చంద్రబాబు పాత్రపై కేఏ పాల్ అనుమానాలు

KA Paul on YS Vivekananda Reddy Murder Case Probe: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు సరైన దిశలో సాగడం లేదని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి హత్య జరిగి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వివేకా కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు పాత్రపైనా దర్యాపు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి వివేకాను హత్య చేసివుండొచ్చన్న అనుమానాన్ని కేఏ పాల్ వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో సీబీఐ తేల్చాలని కోరారు. సీబీఐ దర్యాప్తు కరెక్ట్ యాంగిల్ లో జరిగే వరకు ఊరుకోను అంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను సంధించారు.


KA Paul: కేఏ పాల్ సంధించిన ప్రశ్నలు..

వివేకా హత్య జరిగినప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు?
హత్య జరిగిన వెంటనే సంఘటనా స్థలాన్ని ఎందుకు సీజ్ చేయలేదు?
హత్యకు వినియోగించిన ఆయుధాలను ఎందుకు సీజ్ చేయలేదు?
వివేకా మృతదేహానికి పోస్ట్ మార్టం ఎందుకు హడావుడిగా చేశారు?
వెంటనే సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయించలేదు?
చంద్రబాబును ఇప్పటివరకు ఎందుకు ప్రశ్నించలేదు?
ఒక కోణంలోనే ఎందుకు దర్యాప్తు చేస్తున్నారు?

Also Read: డిప్రెషన్‌లో కేసీఆర్, వెంటిలేటర్‌పై కాంగ్రెస్.. తరుణ్ చుక్

కేసీఆర్ ను జైల్లో పెట్టాలి
సచివాలయం కూల్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను జైల్లో పెట్టాలని, ఆయన మానసిక స్థితిని పరీక్షించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. కొత్త ప్రారంభోత్సవాన్ని ఫిబ్రవరి 17న జరగకుండా కోర్టుకు వెళ్లి అడ్డుకున్నామని ఆయన చెప్పారు. అంబేద్కర్ జయంతి రోజునే కొత్త సచివాలయం ప్రారంభోత్సం జరపాలని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ హైకోర్టులో మూడు అంశాలపై వాదించి, గెలిచానని చెప్పుకొచ్చారు. తాను కోర్టుకు వెళ్లడం వల్లే కామారెడ్డి రైతులకు న్యాయం జరిగిందన్నారు. రాజకీయ అవినీతి కారణంగానే దేశం నాశనం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.