Telangana : తెలంగాణలో కేసీఆర్ డిప్రెషన్‌లోను..కాంగ్రెస్ వెంటిలేటర్‌పై ఉంది : తరుణ్ చుక్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం అని తెలిసి సీఎం కేసీఆర్ ‘డిప్రెషన్’ లో ఉన్నారు అంటూ బీజేపీ నేతల తరుణ్ చుక్ ఎద్దేవా చేశారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉందనే విషయం కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని తెలంగాణలో కాంగ్రెస్ వెంటిలేటర్ పై ఉంది అంటూ వ్యాఖ్యానించారు.

Telangana : తెలంగాణలో కేసీఆర్ డిప్రెషన్‌లోను..కాంగ్రెస్ వెంటిలేటర్‌పై ఉంది : తరుణ్ చుక్

BJP leader Tarun chugh's sensational comments on CM KCR

Telangana : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం అని తెలిసి సీఎం కేసీఆర్ ‘డిప్రెషన్’ లో ఉన్నారు అంటూ బీజేపీ నేతల తరుణ్ చుక్ ఎద్దేవా చేశారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉందనే విషయం కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని తెలంగాణలో కాంగ్రెస్ వెంటిలేటర్ పై ఉంది అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరేవారి లిస్ట్ చాలానే ఉందని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం పక్కా అంటూ ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణలో అవినీతి బాగా పెరిగిపోయిందని దోచుకోవటమే పరమావధిగా కేసీఆర్ కుటుంబపాలన ఉందని..తెలంగాణ అవినీతి ఢిల్లీ, పంజాబ్ లను కూడా తాకింది అంటూ విమర్శించారు తరుణ్ చుక్. అసెంబ్లీలో ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై తరుణ్ చుక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో లేని మోడీ గురంచి కేసీఆర్ మాట్లాడటం సిగ్గు చేటు అంటూ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి కోసం ప్రయత్నిస్తుంటే కేసీఆర్ మాత్రం అధికారం పోతుందని పూర్తిగా అర్థమై డిప్రెషన్ లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.

ఉత్తరాదిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీ ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కూడా గెలుపు కోసం అధికారం చేజిక్కించుకోవటానికి ప్లాన్లు వేస్తోంది.ముఖ్యంగా తెలంగాణలో అధికారంపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. దీని కోసం ఇప్పటికే ఉత్తరాదిలో ఉపయోగించిన వ్యూహాలు ఫలించటంతో అవే వ్యూహానాలను తెలంగాణలో కూడా వినియోగించాలని తద్వారా అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల హీట్ కొనసాగుతున్న క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ అన్నట్లుగా ఘాటు విమర్శల పర్వం కొనసాగుతోంది.

Telangana BJP ‘Mission 90’ : ‘మిషన్ 90’ లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ దూకుడు..15 రోజుల్లో 11వేల కార్నర్ మీటింగ్స్ ప్లాన్

కేంద్రం తెలంగాణలు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ అంటుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ మాత్రం తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం అని తెలుసుకున్న కేసీఆర్ అధికారం పోతుందనే ‘డిప్రెషన్’ లో ఉన్నారు అంటూ ఎద్దేవా చేశారు తరుణ్ చుక్. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోందని..కార్నర్ మీటింగులతో ప్రజల్లోకి వెళుతున్నామని కేసీఆర్ చేసిన అవినీతిని ప్రజలకు వివరిస్తామని అన్నారు. తెలంగాణలో జరిగే కార్నర్ మీటింగ్ లకు బీజేపీ అగ్రనాయకులు వస్తారని..ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు అమిత్ షా లాంటి నేతలు కూడా పాల్గొంటారని తెలిపారు. అలాగే కార్నర్ మీటింగుల్లో కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారని తెలిపారు.

కాగా.. తెలంగాణలో అధికారం కోసం బీజేపీ దూకుడు కొనసాగిస్తూ.. ‘మిషన్ 90‘ లక్ష్యంగా వేలాదిగా మీటింగులకు ప్లాన్ చేసింది. 15 రోజుల్లో 11వేల కార్నర్ మీటింగులు జరపాలని..గ్రామాల్లో ఫిబ్రవరి 10నుంచి 25 వరకు వరకు కార్నర్ మీటింగులు జరపటానికి పక్కాగా ప్లాన్ వేసింది. ఈ కార్నర్ మీటింగుల్లో భాగంగా 800లమంది లీడర్లను నియమించింది. ఈ కార్నర్ మీటింగులను ఎలా నిర్వహించాలి ఎలా సమన్వయం చేసుకోవాలి? అనే అంశాలపై బీజేపీ సంక్షేమ పథాకాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ మీటింగ్స్ లో దిశానిర్దేశం చేస్తారు.