Telangana BJP ‘Mission 90’ : ‘మిషన్ 90’ లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ దూకుడు..15 రోజుల్లో 11వేల కార్నర్ మీటింగ్స్ ప్లాన్

‘మిషన్ 90’ లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. 15 రోజుల్లో 11వేల కార్నర్ మీటింగ్స్ ప్లాన్ చేసింది. ఈ కార్నర్ మీటింగుల కోసం 800లమంది నాయకులను నియమించింది.

Telangana BJP ‘Mission 90’ : ‘మిషన్ 90’ లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ దూకుడు..15 రోజుల్లో 11వేల  కార్నర్ మీటింగ్స్ ప్లాన్

Telangana BJP Mission 90

Telangana BJP ‘Mission 90’ : తెలంగాణలో అధికారం కోసం బీజేపీ దూకుడు కొనసాగుతోంది. ‘మిషన్ 90‘ లక్ష్యంగా వేలాదిగా మీటింగులకు ప్లాన్ చేస్తోంది. 15 రోజుల్లో 11వేల కార్నర్ మీటింగులు జరపాలని ప్లాన్ చేస్తోంది. గ్రామాల్లో ఫిబ్రవరి 10నుంచి 25 వరకు వరకు కార్నర్ మీటింగులు జరుగుతాయి. ఈ కార్నర్ మీటింగ్స్ కోసం బీజేపీ పక్కాగా ప్లాన్ చేస్తోంది. దీంట్లో భాగంగా ఈ కార్నర్ మీటింగుల కోసం 800లమంది లీడర్లను నియమించింది. ఈ కార్నర్ మీటింగులను ఎలా నిర్వహించాలి ఎలా సమన్వయం చేసుకోవాలి? అనే అంశాలపై మంగళవారం (ఫిబ్రవరి 7,2023) మన్నెగూడలో బీజేపీ నేలకు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఏ అంశాలపై చర్చించాలి? అనేదానిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.

తెలంగాణలో అధికారం సాధించటమే లక్ష్యంగా బీజేపీ కసరత్తులు చేస్తోంది. దీని కోసం అధిష్టానం ఇచ్చిన దిశానిర్ధేశాల ప్రకారం బండి సంజయ్ నుడుచుకుంటున్నారు. రాష్ట్రంలోని నేతలకు బండి దిశానిర్ధేశం చేస్తున్నారు తెలంగాణలో విజయమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానంకూడా తెలంగాణపై ఫోకస్ పెట్టింది. నెలకు రెండు సార్లు తెలంగాణలో పర్యటించాలని బీజేపీ అగ్రనేత హోం మంత్రి అమిత్ షా నిర్ణయించారు. ఇక ప్రధాని మోడీ కూడా రంగంలోకి దిగి తెలంగాణ బీజేపీకి ఎప్పటికప్పుడు బూస్టప్ ఇస్తున్నారు.

సీఎం కేసీఆర్ ఏ క్షణాన్నైనా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారనే వార్తలు వస్తున్న క్రమంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించటానికి బీజేపీ సిద్ధంగా ఉంది. వచ్చే ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే సైన్యాన్ని సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ బీజేపీనే అని చూపించే ప్రయత్నం చేస్తున్న నాయకులు రెట్టించిన ఉత్సాహంతో కదనరంగంలోకి దూకారు. మొత్తం వచ్చే ఎన్నికలలో 90 అసెంబ్లీ స్థానాలను టార్గెట్ చేసుకున్న బీజేపీ ‘ మిషన్ 90’ ప్లాన్ తో రంగంలోకి దిగింది. 15 రోజుల్లో 11వేల కార్నర్ మీటింగులు జరపటానికి  ప్లాన్ చేసింది.  గ్రామాల్లో ఫిబ్రవరి 10నుంచి 25 వరకు వరకు కార్నర్ మీటింగులు జరుగుతాయి.

నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో తెలంగాణలో బీజేపీ గతంలో కంటే పుంజకుంది. అసెంబ్లీ స్థానాలను కూడా గెలుచుకుంది. ఈ దూకుడును కంటిన్యూ చేస్తే అధికారం పెద్ద విషయం కాదంటోంది బీజేపీ. కానీ బీఆర్ఎస్ కూడా గత కొంతకాలంలో బీజేపీపై విరుచుకుపడుతు మరోసారి అధికారం మాదేనంటోంది. బీజేపీ పప్పులు ఉత్తరాది రాష్ట్రాల్లోలా తెలంగాణలో ఉండవంటోంది. కానీ బీజేపీకి తెలంగాణలో బలం పెరుగుతోందని 80 అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీకి బలమైన నాయకులు ఉన్నారని ధీమాతో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం మిగిలిన స్థానాల్లో కూడా బలం పెంచుకోవటానికి ఎప్పటికప్పుడు నేతలకు బూస్టప్ ఇస్తోంది. దీంట్లో బండి సంజయ్ దూకుడు మరింతగా బీజేపీ అధిష్టానానికి ఉపయోగపడుతోంది. ఇలా తెలంగాణలో గెలుపే లక్ష్యంగా అధికారమే లక్ష్యంగా బీజేపీ అహర్నిశలు శ్రమిస్తోంది. మరి ఉత్తరాదిలో బీజేపీ విజయకేతం ఎగురవేసినట్లుగా దక్షిణాది రాష్ట్రాల్లో బోణీ కొడుతుందా? తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందా? అనేది వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాలి.

‘మిషన్ 90’లో భాగంగా పల్లె పల్లెల్లోని ప్రతీ మూలకు బీజేపీని తీసుకెళ్లాలని బీజేపీ కేంద్రంలో చేపట్టే సంక్షేమ పథకాలకు ప్రజలకు వివరించాలని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. ఇది వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఉపయోగపడాలని సూచించింది. ప్రతీ పల్లెలోని ప్రతీ గడపకు బీజేపీని తీసుకెళ్లటానికి ఈ కార్నర్ మీటింగ్ లను షురూ చేస్తోంది. ఉత్తరాదిలో ఫాలో అయిన ప్లాన్స్ ను తెలంగాణలో కూడా వినియోగించి అధికారంలోకి రావాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ వేసింది. ఇప్పటికే గుజరాత్, పశ్చిమ బెంగాల్, యూపీలో అమలు చేసి సక్సెస్ అయ్యామనే భావన హైకమాండ్ లో ఉండడంతో.. దీన్ని తెలంగాణలోనూ ఇంప్లిమెంట్​ చేయాలనేది బీజేపీ యోచనలో భాగంగా తెలంగాణ బీజేపీ పనిచేస్తోంది.

ఎన్నికల ముందే నేతలను సిద్ధం చేసుకోవటానికి గెలుపు గుర్రాలను గుర్తించి వారికే సీట్లు ఇవ్వాలని భావిస్తోంది. దాని కోసం చేరికలపై స్పెషల్​ ఫోకస్ పెట్టింది. అదే సమయంలో చేరికలను నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయికే పరిమితం కాకుండా బూత్ స్థాయి వరకు చేరాలని బీజేపీ ప్లాన్. ప్రతీ పల్లోలోను బూత్ స్థాయిలో పార్టీకి బలమైన నేతలుంటే గెలుపు తథ్యమంటోంది బీజేపీ.