Kadapa : కానిస్టేబుల్ కుటుంబం మృతి ఘటనలో సంచలన విషయాలు.. రెండో భార్య మాటలు విని మొదటి భార్య, ఇద్దరు పిల్లలను చంపేశాడా?
కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కుటుంబం మొత్తం చనిపోవడంపై అతని వదిన సువర్ణలత తీవ్ర ఆదేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లు చనిపోయినా తనకు అభ్యంతరం లేదు కానీ, పిల్లలను చంపడమే బాధాకరం అన్నారు.

Constable Family Death Case
Kadapa Constable Family Case : ఏపీలోని కడపలో కానిస్టేబుల్ కుటుంబం మొత్తం చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురూ మృతి చెందడం అందరి హృదయాలను కలిచివేస్తోంది. కుటుంబం మొత్తం మరణించడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య, ఇద్దరు పిల్లలను చంపి కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కుటుంబ మొత్తం చనిపోవడానికి కారణమేంటీ? అసలు వెంకటేశ్వర్లు ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాడు?
ఎందుకు భార్య, ఇద్దరు పిల్లలను చంపాడు? కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కుటుంబం మృతికి రెండో పెళ్లే కారణమా? రెండో భార్య మాటలు విని మొదటి భార్య, ఇద్దరు పిల్లలను చంపేశాడా? ఇద్దరు భార్యల మధ్య జీవితాన్ని కొనసాగించలేకనే భార్యా పిల్లలను చంపి తానూ తనువు చాలించారా? మరీ మరణా వాంగ్మూలం రాసుకుని ఘాతుకానికి పాల్పడ్డారు. భార్య, ఇద్దరు పిల్లలను చంపి తానూ ప్రాణాలు తీసుకోవడానికి గల బలమైన కారణాలేంటనేదీ చర్చనీయాంశంగా మారింది.
Andhra Pradesh : భార్య, ఇద్దరు పిల్లలను చంపి కానిస్టేబుల్ ఆత్మహత్య
ఈ కేసులో పోలీసుల ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు రెండో భార్య సూచనల మేరకే భార్య మాధవితో పాటు ఇద్దరు కూతుర్లను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో రెండో భార్యకు తాను చనిపోతున్నట్లు వెంకటేశ్వర్లు మెసేజ్ పెట్టారు. రెండో భార్యకు మెసేజ్ పెట్టిన తర్వాత వెంకటేశ్వర్లు తొలుత మొదటి భార్య, ఇద్దరు పిల్లలను నుదుటిపై కాల్చి చంపారు.
కుటుంబ సభ్యులను చంపిన అనంతరం కుడి కనతపై కాల్చుకొని వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నారు. తన మరణానంతరం తనకు వచ్చే డబ్బు, తన రెండో భార్యకు, ఉద్యోగం రెండో భార్య కొడుకుకు చెందాలని వెంకటేశ్వర్లు ముందుగానే మరణ వాంగ్మూలం రాసుకున్నారు. ఈ మేరకు వెంకటేశ్వర్లు 2023జూన్ 26న బాండు పేపర్లు కొనుగోలు చేశారు. మరణ వాంగ్మూలం రాసిన పేపర్లను కూడా ఆరోజే కొనుగోలు చేశారు. దీంతో ఇది ప్రీ ప్లాన్డ్ హత్యగా స్థానికులు పేర్కొంటున్నారు.
కాగా, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కుటుంబం మొత్తం చనిపోవడంపై అతని వదిన సువర్ణలత తీవ్ర ఆదేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లు చనిపోయినా తనకు అభ్యంతరం లేదు కానీ, పిల్లలను చంపడమే బాధాకరం అన్నారు. ఏనాడు తన చెల్లెలు తన మరిది (వెంకటేశ్వర్లు) గొడవ పడిన దాఖలాలు లేవన్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తమకు తెలియదన్నారు. పిల్లలను కాల్చి చంపడం చాలా దారుణమని వాపోయారు.
రెండో పెళ్లి చేసుకున్నట్లు తమకు తెలియదని పేర్కొన్నారు. పోలీసులు చెప్పే వరకు మరణ వాంగ్మూలం రాశాడని కూడా తమకు తెలియదని వెల్లడించారు. కడపలోని కోపరేటివ్ కాలనీలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు భార్య, ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
Ballia: గర్ల్ ఫ్రెండ్ ముందే ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. ఎందుకంటే?
తన తుపాకీతో భార్య, ఇద్దరు పిల్లల నుదిటిపై కాల్చి చంపారు. అనంతరం తానూ అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కుటుంబం ఘటన గురించి స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.