Andhra Pradesh : రూ.2 లక్షల 50వేలు లంచం తీసుకొని గంజాయి వాహనాన్ని వదిలేసిన ఎస్సై..

లంచం తీసుకని గంజాయి వాహనాన్ని వదిలేసిన ఎస్సైను విచారణకు పిలవగా ఏసీపీ కార్యాలయం నుంచి పారిపోయాడు.దీంతో పోలీసులు ఎస్సై కోసం గాలిస్తున్నారు.

Andhra Pradesh : రూ.2 లక్షల 50వేలు లంచం తీసుకొని గంజాయి వాహనాన్ని వదిలేసిన ఎస్సై..

Kakinada Mothugudem SI

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోటు గూడెంలో మాదకద్రవ్యాలను పట్టుకోవాల్సిన పోలీసు అధికారి చేతివాటం చూపించాడు.డబ్బులు చేతిలో పడేసరికి గంజాయి అక్రమరవాణాలో సీజ్ చేసిన గంజాయి వాహనాన్ని వదిలేశాడు.చేతిలో రెండు లక్షలు లంచం పడేసరికి ఈ మాదకద్రవ్యాలతో ఎవరు ఎలా పోతే నాకేంటీ అనుకున్నాడు. కానీ పాపం పండింది. అడ్డంగా బుక్ అయ్యాడు. రెండు లక్షల రూపాయలు తీసుకుని గంజాయి వాహనాన్ని వదిలిసిన పోలీస్ సబ్ ఇన్పెక్టర్ బాగోతం బయటపడింది. అధికారుల విచారణలో మొత్తం అంతా బయటపడింది. సీజ్ చేసిన గంజాయి వాహాన్ని రెండు లక్షలకు కక్కుర్తి పడి వదిలేశాడు ఎస్సై సత్తిబాబు.

రూ.రెండు లక్షల 50వేలు లంచం తీసుకుని మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధి నుంచి సీజ్ చేసిన గంజాయి వాహనాన్ని వదిలేశాడు ఎస్సై బాసింసెట్టి సత్తిబాబు. ఈ విషయాన్ని గంజాయి తరలించే వాహనం డ్రైవర్ స్వయంగా బయటపెట్టటం విశేషం. దీనిపై సత్తిబాబు ఘనకార్యంపై విచారణ చేపట్టిన ఉన్నత అధికారులు సత్తిబాబు వదిలేసిన వాహనాన్ని తిరిగి అదుపులోకి తీసుకున్నారు నెల్లూరు జిల్లా పోలీసులు అధికారులు. అనంతరం ఎస్సై సత్తిబాబుని విచారణ కోసం రంపచోడవరం ఏసీపీ కార్యాలయానికి రప్పించారు. కానీ ఏసీపీ కార్యాలయం నుంచి ఎస్సై సత్తిబాబు బస్సులో పారిపోయాడు.దీంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.