నా కృషితోనే ఏపీకి ‘కియా’ : YCP ప్రభుత్వంపై నమ్మకంలేకే కియా తరలిపోయే పరిస్థితి

  • Published By: veegamteam ,Published On : February 6, 2020 / 11:46 AM IST
నా కృషితోనే ఏపీకి ‘కియా’ : YCP ప్రభుత్వంపై నమ్మకంలేకే కియా తరలిపోయే పరిస్థితి

కియా పరిశ్రమ AP నుంచి తమిళనాడుకు తరలిపోతుందనే అనే వార్తలు పెను సంచలనం కలిగించాయి. ఈ సందర్భంగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…దక్షిణ కొరియాకు కంపెనీ అయిన కియా మోటార్ కంపెనీ ఏపీకి రావటానికి తాను ఎంతో కృషి చేశాననీ తన చొరవతోనే ఏపీకి కియా పరిశ్రమ వచ్చిందని తన కష్టానికి ఫలితమే అనంతపురంలో కియా మోటార్ కంపెనీ వచ్చిందనీ అటువంటిది ప్రస్తుతం పాలనలో ఉన్న వైసీపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో అది పక్కరాష్ట్రాలకు తరిలిపోయే పరిస్థితులు వచ్చాయని అన్నారు.  

 కియా మొదటి చాయిస్‌గా తమిళనాడు.. తర్వాత చాయిస్‌గా గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయన్నారు. అలాగే మహారాష్ట్ర కూడా తమవద్ద మార్కెట్ బాగుందని కియాను ఆఫర్‌ చేసిందని చంద్రబాబు అన్నారు. కియా మోటార్ కంపెనీకోసం గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలు పోటీ పడ్డాయనీ..కానీ ఏపీపై ఉన్న ఏపీపై నమ్మకంతోనే అనంతపురంలో కియ పరిశ్రమ ఏర్పాటైందని తెలిపారు.

కియో మోటార్ కంపెనీ ఇండియాలో పెట్టటంలో ఫస్ట్ చాయిస్ తమిళనాడుకీ రెండోది గుజరాత్ రాష్ట్రాలకు మూడవ ఛాయిస్ లో ఏపీ ఉందనీ కానీ తన కియో అధినేతల్ని ఒప్పించి వారికి ఏపీపై నమ్మకం కల్పించి ఎట్టకేలకు తీసుకువచ్చామని స్పష్టంచేశారు అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు. కియా కంపెనీని గుజరాత్ కు తీసుకువెళ్లాలని పీఎం మోడీ ఎంతగానో కృష్టి చేశారనీ..అయినా ఏపీ దక్కించుకుందని తెలిపారు.  

ఏపీలో కియా మోటార్స్ ప్రారంభోత్సవంలో కియా యాజమాన్యం మాటల్ని గుర్తు చేసిన చంద్రబాబు
ఏపీలో కియా మోటార్స్ ప్రారంభోత్సవం సందర్భంగా కియా అధినేత మాట్లాడుతూ..ఏపీలో కియా మోటార్స్ కంపెనీ పెట్టటమనేది ఒక అద్భుతమని తెలిపారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.  దీనికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్న నాటి నుంచి సీఎం చంద్రబాబు కంపెనీ ఏర్పట్లను చకచకా ఏర్పాటు చేశారని కార్ల తయారీకి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారని..చంద్రబాబు కృషి లేకుంటే ఏపీకి కియా మోటార్ వచ్చేదికాదని అన్నారనీ  తెలిపారని గుర్తు చేశారు. 

అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమలో రావాలని వారి అధినేతల్ని మా సంస్థ కార్లకు మంచి డిమాండ్ ఉంది..మా మార్కెట్ కు మీకు ఎటువంటి భరోసానిస్తారు? ఎటువంటి రాయితీలు ఇస్తారని ప్రశ్నించారనీ..దానికి సంబంధించి అన్ని భరోసాలు ఇచ్చి కియా యాజమాన్యానికి నమ్మకం కల్పించి ఏపీకి తీసుకొచ్చామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.  
 

కియా మోటార్ ఏర్పాటుతో 12వేల మందికి ఉద్యోగాలు.. రూ.13,500 కోట్ల పెట్టుబడులు ఏపీ వచ్చాయి : చంద్రబాబు 
అనంతపురంలో జిల్లాలో కియా మోటార్ ఏర్పాటుతో 12వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని..కియా వల్ల దాదాపు రూ.13,500 కోట్ల పెట్టుబడులు ఏపీ రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. కియాను తరలించాలనుకోవడం దారుణమన్నారు. తమిళనాడులో కియా మోటార్స్‌ సిస్టర్‌ కంపెనీ హుందాయ్ కూడా ఉందన్నారు.

బొత్స అవినీతి కారణంగా వోక్స్‌ వ్యాగన్‌ పుణెకు వెళ్లిందిం :చంద్రబాబు 
భూమి విషయంలో తమిళనాడు డబ్బు అడగడంతో కియా ఏపీకి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అద్భుతంగా సహకరించిందని.. ఈ విషయం కియా కూడా చెప్పిందన్నారు. చంద్రబాబు లేకుంటే ఈ ప్రాజెక్ట్‌ సాధ్యమయ్యేది కాదన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నాలుగైదు నెలల్లోనే కియాకు నీళ్లిచ్చామని చెప్పారు. రెండు నెలల్లో ఎల్‌అండ్‌టీ ద్వారా భూమి చదును చేయించామని, ఆ తర్వాత తమపై కియాకు నమ్మకం వచ్చిందన్నారు. అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేశామన్నారు. నాడు బొత్స అవినీతి కారణంగా వోక్స్‌ వ్యాగన్‌ పుణెకు వెళ్లిందని చంద్రబాబు తెలిపారు.

అంతర్జాతీయ కంపెనీతో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించే పద్ధతి ఇదేనా?చంద్రబాబు 
అంతర్జాతీయ కంపెనీతో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించే పద్ధతి ఇదేనా? అని బాబు ప్రశ్నించారు. కంపెనీ సీఈవోను ఓ ఎంపీ బెదిరిస్తే.. కొత్త కంపెనీలు ఏమైనా వస్తాయా? అని బాబు అని ప్రశ్నించారు. తమ వాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ వైసీపీ నాయకులు బెదిరించారని మండిపడ్డారు.

కియాకు రాయితీ ప్రోత్సాహకాలను సమీక్షిస్తామని మంత్రి అన్నారని, భూములు ఇవ్వొద్దని జగన్‌ రైతులను రెచ్చగొట్టారని విమర్శించారు. నాడు బొత్స అవినీతి కారణంగా వోక్స్‌ వ్యాగన్‌ పుణెకు వెళ్లిందని, ఇప్పటికీ ఆ కేసు బొత్స సత్యనారాయణపై ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ రైతు వాళ్ల మాటలు వినలేదని, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని రైతులు భూములిచ్చారని చంద్రబాబు అన్నారు.