Vaccine Information : ఏపీ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్ లు వచ్చాయి ? పూర్తి వివరాలు

Vaccine Information : ఏపీ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్ లు వచ్చాయి ? పూర్తి వివరాలు

Jagan Ap

Andhrapradesh : రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ లెక్కలను ప్రభుత్వం విడుదల చేసింది. కోవీ షీల్డ్‌ డోస్‌ పరిమాణం కాస్త ఎక్కువ మొత్తంలో వస్తోందని తెలిపింది. కోవాక్సిన్‌ పరిమాణం బొటాబొటీగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. కోవీషీల్డ్‌ను ఎక్కువ మందికి నైపుణ్యత ఉన్న ఆరోగ్య సిబ్బంది ఇవ్వగలుగుతున్నారు.

10–05–2021

ఏపీ రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌
రాష్ట్రానికి వచ్చిన కొవీషీల్డ్‌ డోసులు : 60,60,400
తొలి డోస్‌ కింద : 43,99,802
రెండో డోస్‌ కింద : 16,87,315
మొత్తం : 60,87,117 డోస్‌లు
రాష్ట్రానికి వచ్చిన కోవాక్సిన్‌ డోసులు : 12,89,560
తొలి డోస్‌ కింద : 9,23,296
రెండో డోస్‌ కింద : 2,90,047 వ్యాక్సిన్లు
మొత్తం : 12,13,343 కోవాక్సిన్‌ డోస్‌లు

కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండూ కలిపి రాష్ట్రానికి వచ్చినవి : 73,49,960 డోస్‌లు
తొలి డోస్‌ కింద : 53,23,098 వ్యాక్సిన్లు
రెండో డోస్‌ కింద : 19,77,362 వ్యాక్సిన్లు..
రెండూ కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో వ్యాక్సిన్లు : 73,00,460 వ్యాక్సిన్లు
ఇక 45 ఏళ్లకు పైబడిన వారు మొత్తంగా 1,33,07,889 మంది నమోదు
ఇందులో తొలి డోస్‌ కింద : 41,08,917 మందికి
రెండో డోస్‌ :13,35,744 మందికి వ్యాక్సిన్లు వేశారు.

మే నెలలో
మే,2021 మొదటి 15 రోజులకు సంబంధించి

కోవిషీల్డ్, కొవాక్సిన్‌ రెండూ కలిపి 9,17,850 డోస్‌లు ఇస్తామన్న కేంద్రం ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోస్‌లు 7,65,360 అని వెల్లడించింది. ఇంకా రావాల్సినవి 1,52,490 డోస్‌లని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసే కోటా కింద కేంద్రం కేటాయించిన డోస్‌లు 16,85,630..ఇప్పటి వరకు వచ్చినవి 4,93,930..ఇంకా రావాల్సినవి 11,91,700 గా తెలిపింది.