ఓటుకు నోటు కేసును సీబీఐతో దర్యాప్తు జరపాలి : ప్రశాంత్ భూషణ్

ఓటుకు నోటు కేసును సీబీఐతో దర్యాప్తు జరపాలి : ప్రశాంత్ భూషణ్

Vote for Note Case : ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గురువారం విచారించిన సుప్రీం ధర్మాసనం.. చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్ పై జులైలో విచారిస్తామని పేర్కొంది. వేసవి సెలవుల తర్వాత విచారణ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

కచ్చితమైన విచారణ తేదీని నిర్ణయించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానాన్ని కోరారు. తమ లిఖిత పూర్వక ఆదేశాల్లో ఇస్తామని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. ఓటుకు కోటు కేసు ఛార్జ్ షీటులో చంద్రబాబు పేరును 37సార్లు ప్రస్తావించారు.

ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని, కానీ, ఏసీబీ ఆయన పేరు చేర్చడం లేదన్నారు. చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేదని పిటిషన్‌లో న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు చేర్చి సీబీఐ దర్యాప్తు జరపాలని కోర్టును అభ్యర్ధించారు.