మదనపల్లి మర్డర్ కేసు.. అలేఖ్య క్యారెక్టర్ గురించి అసలు నిజాలు : స్నేహితుడు ఏం చెప్తున్నాడు

మదనపల్లి మర్డర్ కేసు.. అలేఖ్య క్యారెక్టర్ గురించి అసలు నిజాలు : స్నేహితుడు ఏం చెప్తున్నాడు

MADANAPALLY MURDERS: చిత్తూరు మదనపల్లి జంట హత్యల వెనుక జరిగిందేంటి.. అందరూ అనుకుంటున్నట్లు అలేఖ్య స్వభావం అలాంటిదేనా.. ఆమె స్నేహితుడు తన గురించి ఏమని చెప్తున్నాడు.. ఎటువంటి కీలక సందేహాలను లేవనెత్తాడు.. ఇన్వెస్టిగేషన్ పై అతని అభిప్రాయం ఏంటి.. అలేఖ్య క్యారెక్టర్ గురించి ఏం చెప్పాడు

అలేఖ్య చెల్లి డిజిటల్ అకౌంట్లు ఎందుకు తారుమారయ్యాయి
సాయి దివ్య ఫేస్‌బుక్ అకౌంట్ ఏమైంది.. ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ సడెన్ గా divsalekyaగా అలేఖ్య పిక్చర్ తో ఎందుకు మారింది. ఉన్నట్లుండి అకౌంట్లో పోస్టులన్నీ మాయం కావడానికి కారణమేమై ఉండొచ్చు. అలేఖ్యకు ఇంకో అకౌంట్ ఉందా.. అలేఖ్య నిజమైన అకౌంట్ నుంచి చేసిన పోస్టులకు alekyadivs పేరిట ఆమె చెల్లి చేసినట్లుగా కామెంట్లు ఉన్నాయి.
అంటే, ఎవరు.. ఎందుకు సాయి దివ్య అకౌంట్ పేరు మార్చారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు ఎందుకు డిలీట్ చేశారు. ఫేస్ బుక్ అకౌంట్ కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి.

అలేఖ్య ఆన్‌లైన్ ప్రవర్తన ఎందుకు మారిపోయింది
అలేఖ్య ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో చూస్తే.. పొలిటికల్ గా, ఇస్లామోఫోబిక్ గా ఉన్న పోస్టులు సున్నాగా ఉన్నాయి. ఆమె చాలా వరకూ తన సొంత పోస్టులనే షేర్ చేసుకునేది. ఎక్కువ శాతం ధార్మికంగా పోస్టు చేసేది. మొత్తం ధ్యానపరంగా మాత్రమే చేసేది. అందులో ఎటువంటి సంప్రదాయ నమ్మకం కనిపించేది కాదు. ఇస్లామోఫోబిక్ పోస్టులు ఈ త్యాగం చేయాలనుకున్నప్పుడే మొదలయ్యాయి. దాని ఉద్దేశ్యం ఏదో రచ్చ చేయాలని కాదా..?

అలేఖ్య ఇన్‌స్టాగ్రామ్ ప్రైవసీని ఎవరు మార్చేశారు
అలేఖ్య ఇన్‌స్టాగ్రామ్ అనేది ప్రైవేట్ అకౌంట్. ఫాలోవర్లలో ఆమె అప్రూవల్ చేయకుండా ఎవరూ ఆ పోస్టులు చూడలేరు. హత్య జరగడానికి ముందే పబ్లిక్ అటెన్షన్ ను అట్రాక్ట్ చేసుకునేలా.. ఆమెను అంత కిరాతకంగా చూపించాలనే ఆలోచన ఎవరికి వచ్చింది. ఆ హత్యల తర్వాత తల్లి వైపే అందరి ఫోకస్ ఉంది కానీ, అసలు ఈ మార్పులను అందరూ ఎందుకు గమనించలేదు. తల్లి అతీత శక్తుల కోసమే ఇదంతా చేసిందా..

అలేఖ్యకు ఇస్లామోఫోబియా ఉందా..
అవును. అలేఖ్య ఇస్లాం గురించి అటువంటివే కొన్ని ప్రత్యేకమైన పోస్టులు షేర్ చేసేది. అది కూడా ఫేస్‌బుక్‌లో మాత్రమే. ప్రైవసీ రూల్స్ బోలెడు సెట్టింగ్స్ అన్నీ పెట్టుకుని పోస్టు చేసేది. ఆమె ఫ్రెండ్స్ కూడా తన అన్ని పోస్టులు చూడటానికి వీల్లేదు. సోషల్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ గురించి మంచి అవగాహనతోనే ఉండేది. అటువంటిది ఆమె అకౌంట్ కు ఏమై ఉండొచ్చు. ఓపెన్ గా ఇస్లాం ఈజ్ డెడ్ అని ఎందుకు రాసింది.

అలేఖ్య కర్మవాది కానే కాదు
పైన చెప్పినట్లుగానే అలేఖ్య కర్మవాది కాదు. ఆధ్మాత్మికంగా ఉన్నతంగా ఉండేది. పూర్తిగా ధ్యానపరంగానే ఉండేది. కచ్చితంగా ఆమె కర్మవాదాన్ని అస్సలు అనుసరించేది కాదు. దాంతోపాటు ఆమెకు అనేక మంది దేవుళ్లు/హైందవంలో శక్తులపైన నమ్మకం ఉండేది కాదు. ఓషో బుక్స్ లాంటి వాటి నుంచి ఎటువంటి గైడెన్స్ తీసుకోవడానికి ఆమె రెడీగా ఉండేది కాదు. తనకు తానుగా ధ్యానం చేసింది.
ఆమె ఇవన్నీ చేయలేదని మాట్లాడేవాళ్లలో నేనూ ఒకర్ని. బలిదానం ఇచ్చుకుంటే ఏదో లాభం చేకూరుతుందనే దానికి ఆమె వ్యతిరేకం.
అలాంటి కర్మవాది అయిన మహిళ తనను, తన చెల్లెల్ని అంతమొందించుకుని సత్యయుగం నాటికి చెందినదిగా చెప్పుకోదు కదా. ఏ బాబానో చెప్పినట్లుగా ఆమె చేయలేదు. పేరెంట్స్ గానీ, మరెవ్వరో చెప్పింది ఆమె చేయదు.

అలేఖ్యకు  చెల్లంటే చాలా ఇష్టం
అలేఖ్యకు తన చెల్లంటే పిచ్చి ప్రేమ. కలిసి తినే వారు, కలిసే యోగా చేసే వారు. బాయ్ ఫ్రెండ్స్, సెక్స్ విషయాలు సైతం షేర్ చేసుకునే చనువు కూడా వారిద్దరి మధ్యలో ఉంది. పెళ్లి విషయంలో సమాజానికి తగ్గట్లు పేరెంట్స్ ఒత్తిడి తెచ్చినా ఇద్దరూ కలిసి ఒకే మాట మీద సెటిల్ అయ్యేవరకూ వద్దని చెప్పారు.
అలేఖ్య తన చెల్లెలికి పదేళ్లుగా సైకియాట్రిక్ హెల్ప్ చేస్తుంది. అలాంటి స్థితి నుంచి కూడా కేరింగ్ తీసుకుని బయటపడేసింది. అలేఖ్యతో పాటు ఆమె సిస్టర్ కూడా తల్లి మెంటల్ కండిషన్ గురించి అవగాహనతోనే ఉంది. లాక్ డౌన్ అయిపోయాక వీలైనంత త్వరగా బయటకు వెళ్లిపోవాలనుకుంది. ఉద్యోగంతో పాటు ఆన్ లైన్ ట్యూషన్స్, అమెరికన్ హై స్కూల్ స్టూడెంట్స్ కు హోం వర్క్ అసిస్టెన్స్ నిర్వహించే వెబ్‌సైట్‌కు పనిచేసేది. ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడకుండా ఉండేందుకు.. స్వేచ్ఛను కోల్పోకూడదని సొంత కాళ్లపై నిలబడాలనే తపనపడేది. అలాంటి అలేఖ్య.. చెల్లెల్ని మర్డర్ చేసి వచ్చేంత వరకూ పూజ గదిలో నగ్నంగా కూర్చొని ఉంటుందా..? తన మర్డర్ గురించి నిరీక్షించిందా..?

ఆ కుక్కకు ఏమైంది?
ఈరోజు వరకు నేను చూసిన అలేఖ్య.. తన కుక్కను చాలా ప్రేమించింది. కన్నతల్లిలా చూసుకుంది. చెప్పాలంటే.. అంతకన్నా ఎక్కువే తన చెల్లెలితో సమానంగా ప్రేమించేది. గత నవంబర్లోనే తన కుక్కకు కరోనా వ్యాక్సిన్ వేయించాలంటూ తండ్రిని, చెల్లినీ బలవంతపెట్టింది. ఎందుకంటే ఆ కుక్క వయసులో పెద్దదనీ, ఇంకో ఛాన్స్ తీసుకోవాలని అలేఖ్య అనుకోలేదు. ఇప్పటివరకూ మీడియా, స్థానికులు చెప్పినట్టుగా కుక్క గురించి పోలీసులకు అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు.

ఎందుకు? ఆ కుక్కకు ఏమైంది? దాన్ని కూడా చంపేశారా? లేదా అది పారిపోయిందా? ఒకవేళ ఇంట్లోనే ఉండి ఉంటే వారిద్దరినీ కాపాడటానికి ఎందుకు ప్రయత్నించలేదు.

శివ.. మోహినిల సంగతేంటి?
ఒకవేళ అలేఖ్య ఆచారాలను నమ్మేదే అయితే.. హిందూ పురాణం ప్రకారం మోహిని ఎవరో తనకు బాగా తెలిసే ఉంటుంది
1. మోహిని అంటే విష్ణు అవతారం, శివుడిది కాదు
2. మోహినిని ఎవరూ పూజించరు, ఎందుకంటే ఆమె దురదృష్టానికి, పిచ్చితనానికి నిదర్శనం అని అందరికీ తెలుసు గనుక.
అలాంటప్పుడు తను ఎందుకు ముందు శివుడు వస్తున్నాడు అని రాస్తుంది. ఆ తరువాత తన పేరులో మోహిని అని ఎందుకు చేర్చుతుంది.

గడిచిన నాలగు రోజుల్లో ఏం జరిగింది?
అలేఖ్య ఇస్ట్రాగ్రామ్ అకౌంట్‌ను పరిశీలించినట్టయితే.. హత్యకు సరిగ్గా నాలుగు రోజుల ముందు వరకూ తన అకౌంట్లో పోస్టులు చాలా సాధారణంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఫేస్ బుక్ లో, ఇస్ట్రాగ్రామ్ లో అసాధారణ పోస్టులు పెరగడం మొదలయ్యాయో.. అప్పటినుంచే అంటే ఆ నాలుగు రోజుల నుంచే తన తల్లిదండ్రులు పనిమనిషులను కూడా ఇంట్లోకి రానివ్వడం మానేశారు. ఎందుకంటే బలిపీఠాన్ని ఇంట్లోనే సిద్థం చేయడం జరిగింది గనుక.

అలేఖ్య కఠినమైన శాఖాహారి.. తాను మాంసం తినదు ఎందుకంటే మనుషుల అవసరం కోసం జంతువులను చంపి తినడం తనకు నచ్చదు. నిజానికి మనుషులు, జంతువులు సమానవే, వాటిని చంపే హక్కు మనకు లేదు అనేవారిలో అలేఖ్య కూడా ఒకరు. అలాంటి అమ్మాయి ఇలాంటి బలి ఇచ్చే కార్యక్రమానికి సిద్ధపడుతుందా? ఈ నాలుగు రోజుల్లో తనకు ఏమైంది? అలేఖ్య అకౌంట్ నుంచి ఎవరు ఈ పోస్టలు చేశారు, ఎందుకు? అందిరి దృష్టి అలేఖ్య ఎకౌంట్ పైనే పడాలనుకున్నారా, తన చెల్లిలు కనపడకుండా పోవడాన్ని సోషల్ మీడియా గుర్తించలేదా? దీని వల్ల ఎవరికే లాభం చేకూరుతుంది?

ఈ ప్రశ్నలన్నింటిని పరిశీలించాలి, వీటికి సమాధానాలు కచ్చితంగా దొరకాలి. అలా అని అలేఖ్య, ఆమె చెల్లిలిని తన తల్లి చంపిందని నేను అనుకోను, అమె తండ్రికూడా. వీరిద్దరే ఈ చావులకు కారణమని నేను అనుకోవడం లేదు. మానసిక స్థతి బాగాలేని, భ్రమలో బతికే 50ఏళ్ల మహిళ తమ పిల్లల ఆలోచనలను మార్చేసిందని నేను అస్సలు అనుకోను. ముఖ్యంగా అలేఖ్యను ఇలాంటి విషయంలో ప్రేరేపించింది అనడంలో అనడంలో వాస్తవం లేదు. అలేఖ్య తల్లి భర్త సహాయంతో పిల్లలను ఇలా చేసి ఉండదు. అందులోనూ నాలుగు రోజులు బయటకు వెళ్లనివ్వకుండా ఆపగలిగారు అంటే అస్సలు నమ్మలేను. అలేఖ్య అకౌంట్ నుంచి పోస్టులు చేయాల్సిన అవసరం వారికి లేదు. ముఖ్యంగా సాధారణ పోస్టులు కనిపించే అకౌంట్లో ‘వర్క్ ఈజ్ డన్’, ‘శివ ఈజ్ కమింగ్’ అనే పోస్టుల మధ్య ‘హ్యాపీ చెల్డ్ లెస్ నెస్’ అని పోస్ట్ చేయడం

నేను ఎవరంటే..
నేను అలేఖ్య స్నేహితుడని, చెప్పాలంటే తను చనిపోవడానికి ఐదు వారాల ముందు వరకూ తనతో చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తిని. మేము విడిపోయి.. మాట్లాడుకోవడం మానేసిన తర్వాత నేను ఆమెను అన్ని చోట్ల బ్లాక్ చేసి ఉంచాను. అలేఖ్య మరణ వార్త గురించి ఆమె ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని అలర్ట్ అయ్యాను. అంతే కాదు ఆమె మరణం ‘మూఢనమ్మకాలు కలిగిన తల్లి, హిందుత్వ కూతురు’ అనే కోణంతో ఈ ఇన్వెస్టిగేషన్ ముగిసిపోకూడదని కోరుకుంటున్న వ్యక్తిని.

నేను ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే.. విషయం తెలిశాక నేను షాక్ అయి.. మౌనంగా ఉండిపోయా. అలేఖ్య తల ముక్కలుగా చూడటం, రక్త కారుతున్న నుదురు, సగం తెరుచుకుని ఉన్న కళ్లు, నోట్లో ఏదో ఉంచినట్లు తెరిచి ఉంచడం చూసి నన్ను నేను తమాయించుకోవడం కష్టమైంది. ఈ విషయాన్ని గురించి పోలీసులు, మీడియా కాకుండా ఎవరైనా గట్టిగా మాట్లాడతారనీ నాకు నేనే నచ్చజెప్పుకున్నాను. నేను ఇంగ్లీషులో ఫేస్ బుక్, ట్విట్టర్, న్యూస్ ఛానెల్స్, వెబ్ సైట్స్ సంభాషణలు చదివా. కనీసం వాటిలో అయినా వేరే ఏ కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లు అనిపించడం లేదు.

REMEMBERING ALEKHYA, SETTING THE RECORD STRAIGHT, AND GAPING HOLES/RED FLAGS

There are a couple of finer points in the…

Posted by Mrinaal Prem Swarroop Srivastava on Tuesday, January 26, 2021