Mahalakshmi Case: రైతు భరోసా కేంద్రం ఉద్యోగిని మహాలక్ష్మి హత్య కేసులో విస్తుగొలిపే వాస్తవాలు

మహాలక్ష్మి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. అంతేకాక మహాలక్ష్మితో శ్రీనివాస్ ఫోన్ సంభాషణ, వాట్సాఫ్ చాటింగ్‌పై పోలీసులు దృష్టి సారించారు.

Mahalakshmi Case: రైతు భరోసా కేంద్రం ఉద్యోగిని మహాలక్ష్మి హత్య కేసులో విస్తుగొలిపే వాస్తవాలు

Mahalakshmi case

Rythu Bharosa Center Employee: అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం ఎస్‌కేఆర్ లాడ్జిలో రైతుభరోసా కేంద్రంలో పనిచేస్తున్న మహాలక్ష్మీ హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కూర్మన్నపాలేనికి చెందిన మహాలక్ష్మి లాడ్జిలో హత్యకు గురైంది. ఆమెతో పాటు అదే గదిలో ఆమె భర్త శ్రీనివాసరావుకూడా కత్తిపోట్లతో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. భర్త శ్రీనివాసరావే మహాలక్ష్మిని హత్యచేసి, తాను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.

Pushpa 2 : పుష్ప 2 ఆర్టిస్టులకు రోడ్డు ప్రమాదం.. షూటింగ్ కి వెళ్లొస్తుండగా..

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నెల రోజులుగా మంచివాడిగా నటించిన శ్రీనివాస్ కక్షకట్టి పథకం ప్రకారమే మహాలక్ష్మిని లాడ్జికి రప్పించి దారుణ హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. లాడ్జి గదిలో తనిఖీలు చేయగా.. రెండు కత్తులు, సిరంజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ముందు మత్తు ఇచ్చాడేమోనని అనుమానిస్తున్నారు. ఇదిలాఉంటే మృతిరాలి పోస్టుమార్టం రిపోర్టులో ఆమె శరీరంపై 16 కత్తిపోట్లు ఉన్నట్లు తేలింది.

Hyderabad : హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 20కి పైగా కార్లు దగ్ధం

సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతేకాక మహాలక్ష్మితో శ్రీనివాస్ ఫోన్ సంభాషణ, వాట్సాఫ్ చాటింగ్‌పై పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఉన్న శ్రీనివాస్ అనకాపల్లిలో చికిత్స పోదుతున్నాడు. ఇదిలాఉంటే మహాలక్ష్మి హత్యతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మహాలక్ష్మి సచివాలయ ఉద్యోగి అని, శ్రీనివాసరావు ఎటువంటి పని చేయకుండా జలాయిగా తిరుగుతూ ఉండేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Hyderabad Crime: బంజారా‌హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.. వాచ్‌మెన్ మృతి

2020లో ఇద్దరూ ప్రేమవివాహం చేసుకున్నారని, ఆ తరువాత కొద్ది కాలానికే మహాలక్ష్మిని వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు వాపోయారు. వివాహం జరిగిన ఎనిమిది నెలలకే ఇరువురు మధ్య విబేధాలు తీవ్రస్థాయికి చేరడంతో విడాకులు తీసుకుందామని అనుకున్నారని, ఇద్దరి అంగీకారంతో విడాకులకు సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో ఉందని మృతురాలి కుటుంబసభ్యులు తెలిపారు.