East Godavari : కొడుకును కాపాడబోయి తండ్రి మృతి

జలపాతం కింద సరదాగా గడుపుతుండగా పెద్ద కొడుకు దిలీప్‌ నీటిలో మునిగిపోయాడు. పురుషోత్తం నీటిలోకి దిగి కుమారుడిని రక్షించాడు. ఈనేపథ్యంలో పురుషోత్తం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.

East Godavari : కొడుకును కాపాడబోయి తండ్రి మృతి

Dead (1)

East Godavari district : తూర్పుగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. చింతూరు జలపాతంలో ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. నీటిలో మునిగిపోతున్న కొడుకును రక్షించేందుకు దిగిన తండ్రి.. అదే నీటిలో మునిగి మృతి చెందాడు. అయితే, కుమారుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కక్కిరాల పురుషోత్తంగా గుర్తించారు. పురుషోత్తం మృతితో దమ్మపేట, అశ్వారావుపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మ పేటకు చెందిన కక్కిరాల పురుషోత్తం అనే వ్యక్తి అశ్వారావుపేటలో పెట్రోల్ బంకుతో నిర్వహిస్తున్నాడు. ఆయనకు అశ్వారావుపేట మండలం నారాయణపురానికి చెందిన సంతోషిణితో 18 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి 12, 10 సం.ల వయసు గల ఇద్దరు కుమారులు దిలీప్, దీపక్ ఉన్నారు. బుధవారం తమ పెళ్లి రోజు కావడంతో కుటుంబ సమేతంగా విహారయాత్రకు చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని జలపాతానికి వెళ్లారు.

CM KCR : ‘నరేంద్రమోదీని తరిమి.. తరిమి కొట్టాలి’.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

అయితే, జలపాతం కింద వారు సరదాగా గడుపుతుండగా పెద్ద కొడుకు దిలీప్‌ నీటిలో మునిగిపోయాడు. వెంటనే పురుషోత్తం నీటిలోకి దిగి కుమారుడిని రక్షించాడు. ఈ నేపథ్యంలో పురుషోత్తం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. భర్తను కాపాడాలంటూ భార్య, కొడుకులు కేకలు వేయడంతో వచ్చిన స్థానికులు చాలా సేపు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రెండు గంటల తర్వాత లోయలో పడిపోయి ఉన్న పురుషోత్తం మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. మోతుగూడెం పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.