ప్రేమించి మోసం చేశాడని వివాహిత ధర్నా

10TV Telugu News

పెళ్ళై భర్తతో విడాకులు తీసుకున్న మహిళతో సన్నిహితంగా ఉండి, పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకి దిగింది.

పశ్చిమ గోదావరి జిల్లా పాల కొల్లుకు చెందిన శంకర శాస్త్రి అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఒక మహిళతో కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఆ మహిళ మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది.

అయితే…ఇంతకాలం శంకర శాస్త్రి తనను పెళ్ళి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకుని ఇప్పుడు పెళ్లి చేసుకోనంటున్నాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఆమె శంకర శాస్త్రి ఇంటి ముందు ధర్నాకు దిగింది.

కాగా ఆ మహిళకు ముందే వివాహం జరగిందని తనను బ్లాక్ మెయిల్ చేయటానికే ఇలా ధర్నా చేస్తోందని శంకర శాస్త్రి ఆరోపిస్తున్నాడు.