Vishaka : శారదాపీఠం వద్ద మంత్రి సీదిరి అప్పలరాజు నిరసన.. సీఐ దుర్బాషలాడారని ఆరోపణ

భద్రతా సిబ్బంది అసభ్యపదజాలంతో మాట్లాడరని ఆరోపించారు. సంబంధిత అధికారిని పిలిపించి.. తనకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో..

Vishaka : శారదాపీఠం వద్ద మంత్రి సీదిరి అప్పలరాజు నిరసన.. సీఐ దుర్బాషలాడారని ఆరోపణ

Minister Seediri

Minister Seediri Appalaraju : విశాఖపట్టణంలో ఉన్న ప్రముఖ శారదా పీఠం వద్ద రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు నిరసన చేపట్టడంతో కలకలం రేగింది. భద్రతా సిబ్బంది అసభ్యపదజాలంతో మాట్లాడరని ఆరోపించారు. సంబంధిత అధికారిని పిలిపించి.. తనకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు పీఠం గేట్ వద్ద హై డ్రామా కొనసాగింది. శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదు రోజుల పాటు మహోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో… సీఎం జగన్ పీఠానికి రానున్నారు. దీంతో రాష్ట్ర మంత్రి అప్పలరాజు, ఇతరులు అక్కడకు చేరుకున్నారు. లోపలికి వెళ్తుండగా సీఐ అడ్డుకున్నారు. మంత్రి లోపలకి వెళ్లాలని అనుచరులు అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి చెప్పిన మాటలను ఆయన పట్టించుకోలేదు. దీంతో దురుసుగా గెట్ వేసి లోపలకి వెళ్లాలని, లేకుంటే లేదని సీఐ తేల్చిచెప్పారు. ఎంట్రన్స్ వద్ద మంత్రిని సర్కిల్ ఇన్స్ పెక్టర్ దుర్బాషలాడినట్లు సమాచారం. తనకు క్షమాపణలు చెప్పాలని మంత్రి అప్పలరాజు, అనుచరులు డిమాండ్ చేశారు. అయినా.. సీఐ క్షమాపణలు చెప్పక పోవడంతో మంత్రి అప్పలరాజు అలిగి వెనక్కి వెళ్లిపోయారు. మంత్రి సీదిరి అప్పలరాజు నిరసనపై ఎలాంటి వివరణనిస్తారో చూడాలి.

Read More : Akshay Kumar : ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా అక్షయ్ కుమార్

ఏపీ సీఎం జగన్ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొననున్నారు. 2022, ఫిబ్రవరి 09వ తేదీ బుధవారం ఉదయం 10.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరారు. అనంతరం 11 గంటలకు వైజాగ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని రోడ్డు మార్గాన ప్రయాణించి 11.30 గంటలకు శ్రీ శారదా పీఠం చేరుకున్నారు. ఒంటిగంట వరకు అక్కడే ఉండనున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని తిరుగుప్రయాణం అవుతారు. వార్షికోత్సవాల్లో భాగంగా తొలిరోజు గురువందనం, గోపూజతో ఈ ఉత్సవాలకు పీఠాధిపతి సర్వపానందేంద్ర, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వాములు అంకుర్పారణ చేశారు.

Read More : World Highest Chenab bridge : మేఘాలపై..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి లేటెస్ట్ ఫోటోలు

తర్వాత గణపతిపూజ, పుణ్యహవచనం, అగ్నిమధనం, రాజశ్యామల యాగం, నిత్యపీటపూజ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి మహా మంగళహారతి ఇచ్చారు. పీఠం వార్షికోత్సవాలు సందర్భంగా అనేక ఆధ్మాతిక కార్యక్రమాలు, సాంస్కృతిక విభావరి, సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.