Balakrishna: ఇక ఊరుకొనేది లేదు.. వారికి బాలయ్య మాస్ వార్నింగ్..

వైసీపీ శ్రేణులకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్లు ఓపిక పట్టాం.. ఇక ఊరుకొనేది లేదంటూ హెచ్చరించారు. రెండు రోజుల క్రితం శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండలో వైకాపా, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కొడికొండలో జాతర జరిగింది. ఈ సమయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ...

Balakrishna: ఇక ఊరుకొనేది లేదు.. వారికి బాలయ్య మాస్ వార్నింగ్..

Tdp Mla

Balakrishna: వైసీపీ శ్రేణులకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్లు ఓపిక పట్టాం.. ఇక ఊరుకొనేది లేదంటూ హెచ్చరించారు. రెండు రోజుల క్రితం శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండలో వైకాపా, టీడీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కొడికొండలో జాతర జరిగింది. ఈ సమయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తడంతో తెదేపా కార్యకర్తలు నర్సింహమూర్తి, రవిలు గాయపడ్డారు. అయితే జరిగిన ఘటనను ఆ పార్టీ నేతలు బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ క్రమంలో కొడికొండకు చేరుకొని గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించారు.

Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. వైసీపీ శ్రేణులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల జోలికి వ‌స్తే ఊరుకోబోమ‌ని అన్నారు. టీడీపీ కార్య‌క‌ర్త‌లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. గ్రామాల్లో వైసీపీ నేత‌లు క‌క్ష‌లు రేపుతున్నారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్న వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. టీడీపీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, వైసీపీ ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తలకు అన్నివిధాల అండగా నిలుస్తామని తెలిపారు. ప్రజల్లో వైసీపీ పాలన పట్ల వ్యతిరేఖత పెరిగిందని, దానిని సద్వినియోగం చేసుకొని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు ముందుకు సాగాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!

అంతకు ముందు చిలమత్తూరు మండల కొడికొండకు వస్తున్న బాలకృష్ణ వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. బాలయ్య కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. కాన్వాయ్‌ని లేకుండానే కేవలం బాలకృష్ణ వాహనాన్ని మాత్రమే పోలీసులు గ్రామంలోకి అనుమతించారు. బాలకృష్ణ రాకతో భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు తరలి వచ్చారు.