TDP mahanadu: మ‌హానాడు వేదిక‌గా స‌మ‌ర‌శంఖం పూరించ‌నున్న చంద్ర‌బాబు.. నేటి కార్యక్ర‌మాలు ఇలా..

టీడీపీ శ్రేణులు అతిపెద్ద పండుగగా భావించే మహానాడుకు ఒంగోలు సిద్ధమైంది. మహానాడు జరిగే మండవవారిపాలెం పసుపుమయంగా మారింది. నేడు, రేపు జరిగే ఈ మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి 10వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మహానాడు సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒంగోలుకు చేరుకున్నారు. గురువారం మంగళగిరి నుంచి భారీ కార్లు, మోటార్ సైకిళ్ల ర్యాలీతో చంద్రబాబు ఒంగోలుకు చేరుకోగా.. టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అయితే మహానాడులో చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

TDP mahanadu: మ‌హానాడు వేదిక‌గా స‌మ‌ర‌శంఖం పూరించ‌నున్న చంద్ర‌బాబు.. నేటి కార్యక్ర‌మాలు ఇలా..

Tdp Mahanadui

TDP mahanadu: టీడీపీ శ్రేణులు అతిపెద్ద పండుగగా భావించే మహానాడుకు ఒంగోలు సిద్ధమైంది. మహానాడు జరిగే మండవవారిపాలెం పసుపుమయంగా మారింది. నేడు, రేపు జరిగే ఈ మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి 10వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మహానాడు సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒంగోలుకు చేరుకున్నారు. గురువారం మంగళగిరి నుంచి భారీ కార్లు, మోటార్ సైకిళ్ల ర్యాలీతో చంద్రబాబు ఒంగోలుకు చేరుకోగా.. టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అయితే మహానాడులో చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

TDP mahanadu: నేటి నుండి టీడీపీ మ‌హానాడు.. ప‌సుపు మ‌యంగా మారిన ఒంగోలు..

మహానాడులో చంద్రబాబు చేయబోయే ప్రసంగంపై టీడీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలంటూ మహానాడు వేదికగా చంద్రబాబు సమరశంఖం పూరించనున్నట్లు తెలుస్తోంది. నాయకుల్ని, కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేయడమే లక్ష్యంగా మాహానాడు నిర్వహణ సాగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రసంగం కీలకంగా మారనుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య పొత్తు వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబుసైతం జనసేనతో జట్టుకట్టేందుకు సుముఖంగానే ఉన్నారు. మహానాడులో రాబోయే ఎన్నికల్లో పొత్తుల విషయపై చంద్రబాబు పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇదిలాఉంటే చంద్రబాబు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుంచి భారీస్పందన వస్తుంది. దీంతో ప్రజల్లో వైసీపీపై వ్యతిరేఖత మొదలైందని టీడీపీ భావిస్తోంది. ఇదే అవకాశంగా టీడీపీ నేతలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని చంద్రబాబు దిశానిర్దేశం చయనున్నారు. ప్రతి గ్రామంలో వైసీపీ ప్రజా వ్యతిరేఖ విధానాలను వివరించాలని చంద్రబాబు నేతలు, కార్యకర్తలకు పిలుపునివ్వనున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి టీడీపీ నేతల్లోనూ ఉత్సాహం నెలకొన్న క్రమంలో ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు మహానాడు వేదికగా హితబోద చేయనున్నట్లు తెలుస్తోది. ఇదిలా ఉంటే మహానాడులో మొత్తంగా 17తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలపై భారాల మీద 12తీర్మానాలు ప్రవేశపెట్టి, వీటిపై చర్చించనున్నారు.

Chandrababu Naidu: “అప్పటి ప్రధాని వాజ్‌పేయి రావడం మరిచిపోలేని సంఘటన”

రెండురోజుల పాటు జరిగే మహానాడు కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఒంగోలు ప్రాంతం పసుపుమయంగా మారింది. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో నేటి తెలుగుదేశం మహానాడు ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ఫొటో ప్రదర్శన, రక్తదాన శిబిరాలను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభిస్తారు. ఉదయం 10.15 నుంచి మహానాడు వేదికపై కార్యక్రమాలు మొదలవుతాయి. అనంతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, పార్టీ జెండాను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. అనంతరం ఇటీవల కాలంలో మరణించిన పార్టీ కార్యకర్తలు , నాయకులకు సంతాప తీర్మానం ఉంటుంది. ఉదయం 11.45 కి చంద్రబాబు మహానాడు వేదికగా ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. అనంతరం తీర్మానాలపై చర్చ జరుగుతుంది. రాత్రి 8 గంటలకు అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. అనంతరం చంద్రబాబు ముగింపు ఉపన్యాసం ఉంటుంది. మహానాడులో భాగంగా రెండవ రోజు శనివారం ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఘనంగా నివాళులర్పించనున్నారు. కాగా శనివారం మధ్యాహ్నం మండువారిపాలెంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగసభకు సుమారు రెండు లక్షల నుంచి మూడున్నర లక్షల మందిని తరలించేలా ఇప్పటికే టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభా ప్రాంగణంలో ప్రతిఒక్కరూ అత్యంత దగ్గర నుంచి వీక్షించేలా 30 నుంచి 35 ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేయనున్నారు. మహానాడు సభా వేదికపై 350 నుంచి 400 మంది ప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు.