Nandyala Tiger : తల్లికి దూరమైన పులికూనలకు వేటాడటం నేర్పించునున్న అధికారులు..

తల్లి నుంచి తప్పిపోయిన నాలుగు పులికూనలను వాటి తల్లి వద్దకు చేర్చటానికి నంద్యాల జిల్లా నల్లమల అడవుల్లో 92 గంటలపాటు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీతో తల్లికి శాశ్వతంగా దూరమైపోయాయి నాలుగు పులి కూనలు. దీంతో ఆ నాలుగు పులికూనలకు అధికారులు తిరుపతి జూకు తరలించారు. వాటిని అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తున్న అధికారులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఆ నాలుగు పులిపిల్లలకు వేటాడం ఎలాగో నేర్పించాలని నిర్ణయించారు.

Nandyala Tiger :  తల్లికి దూరమైన పులికూనలకు వేటాడటం నేర్పించునున్న అధికారులు..

Mother Tiger T108 Operation Concluded

Nandyala Tiger Issue : తల్లి నుంచి తప్పిపోయిన నాలుగు పులికూనలను వాటి తల్లి వద్దకు చేర్చటానికి నంద్యాల జిల్లా నల్లమల అడవుల్లో 92 గంటలపాటు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీతో తల్లికి శాశ్వతంగా దూరమైపోయాయి నాలుగు పులి కూనలు. దీంతో ఆ నాలుగు పులికూనలకు అధికారులు తిరుపతి జూకు తరలించారు. వాటిని అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. పాలు, మాంసం అందించి వాటి ఆలనా పాలనా చూస్తున్నారు. కానీ ఆ పులి పిల్లలు ఇప్పుడు చిన్నగా ఉన్నాయి. రేపు పెద్దయ్యాక కూడా జూ అధికారులు ఇచ్చే ఆహారాన్ని మాత్రమే తింటాయా? అలా తిని జీవించగలవా? వాటి శరీరానికి తగిన ఆహారం అందించకపోతే అవి అనారోగ్యానికి గురి అవుతాయి? పులి అనేది క్రూరమృగం. వేటే దాని లక్ష్యం. వేటాడిన జంతువు మాంసాన్ని తిని జీవించటం పులి లక్షణం. కానీ ఈ పులిపుల్లలు శాశ్వతంగా జూకే పరిమితం అయితే వేటాడటం రాదు.

Operation Tiger T108 : నల్లమల అడవిలో ‘ఆపరేషన్ మదర్ టైగర్ 108 ఫెయిల్’ పిల్లికూనల వద్దకు రాని తల్లి.. ఆందోళనలో అధికారులు

దీంతో అధికారులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఆ నాలుగు పులిపిల్లలకు వేటాడం ఎలాగో నేర్పించాలని నిర్ణయించారు. దీని కోసం పలు రకాల ట్రైల్స్ చేయనున్నారు. ఈ విషయం గురించి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి నాగభూషణం మాట్లాడుతూ..నేషనల్ ఫారెస్ట్ లో ఉండే జంతువులను జూలకు పరిమితం చేయటానికి అనుమతిలేదని అలా ఉంచాల్సిన పరిస్థితి వస్తే రెండు సంవత్సరాలు మాత్రమే ఉంచాలని ఆ తరువాత వాటిని అడవుల్లో వదిలేయాలని తెలిపారు. కానీ ఈ పులిపిల్లలను ఇలాగే జూలో ఉంచి కొంతకాలం తరువాత వాటిని అడవిలో వదిలితే వాటికి వేటాడటం చేతకాదు. అందుకని వాటికి వేట నేర్పించి ఆతరువాత వాటిని అడువుల్లో వదిలివేయాలని అధికారులు భావిస్తున్నారు.

Andhra Pradesh: కొత్తపల్లి మండలంలో కనిపించిన పెద్దపులి పిల్లలు.. జాడ లేని తల్లి పులి.. ఆందోళనలో గ్రామస్తులు

అడవిలో వాటికవి స్వంత్రంగా సహజసిద్ధంగా జీవించటానికి అవసరమైన వేటను నేర్పించి ఆ తరవాత వాటిని అడవిలో వదలాలని భావిస్తున్నారు. ఈ నాలుగు పులిపిల్లలకు వేట నేర్పించటానికి అధికారులు దాదాపు 50 ట్రైల్స్ చేయనున్నారు. అధికారులు ఇచ్చే గైడ్ లైన్స్ ను పులికూనలు ఫాలో అవుతు ఈ ట్రైల్స్ లో సక్సెస్ అయితే వాటిని అడవిలో వదలనున్నారు అధికారులు. ప్రస్తుతానికి వాటికి అవసరమైన ఆహారాన్ని అందిస్తున్నామని వాటికి ఎటువంటి అనారోగ్యం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధకారులు తెలిపారు. తల్లిపాలకు దూరమైన ఈ నాలుగు పులికూనలు డీహైడ్రేషన్ కు గురి అయ్యాయని ప్రత్యేక డాక్టర్ల ద్వారా వాటికి చికిత్స అందిస్తున్నామని అవరమైన ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు.

Nandyala Tiger Issue : ముగిసిన ఆపరేషన్ టైగర్.. దొరకని తల్లి పులి జాడ, తిరుపతి జూకి 4 పులి కూనలు

కాగా నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం, పెద్దగుమ్మడాపురం అనే గ్రామంలో ఈనాలుగు పులిపిల్లలు స్థానికులకు కనిపించాయి.  నల్లమల అడవిలో ఆహారం కోసం వచ్చి తల్లి నుంచి తప్పిపోయిన ఈ నాలుగు పులికూనల్ని స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని తల్లి వద్దకు చేర్చటానికి చాలా శ్రమించారు. కానీ ఫలితం దక్కలేదు. దీంతో ఈ నాలుగు పులికూనల్ని తిరుపతి జూకు తరలించగా అక్కడ వాటిని అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు అధికారులు. కాగా..ఈనాలుగు పులి కూనలన్నీ ఆడవేనని, ఒకేసారి నాలుగు ఆడ పిల్లలకు జన్మనివ్వడం అరుదని అధికారులు తెలిపారు.