Nara Brahmani: లదాఖ్‌లో నారా బ్రాహ్మణి బైక్ యాత్ర.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోడలు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి లదాఖ్ ప్రాంతంలో చేసిన బైక్ రైడ్ వీడియో నెటిజన్లు ఆకట్టుకుంటోంది.

Nara Brahmani: లదాఖ్‌లో నారా బ్రాహ్మణి బైక్ యాత్ర.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Nara Brahmani: టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి, మాజీ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి చేసిన బైక్ రైడింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నారా బ్రాహ్మణి ఇటీవల దేశ సరిహద్దు ప్రాంతమైన లదాఖ్‌, లేహ్ ప్రాంతాల్లో బైక్ రైడ్ చేశారు. ఆమె జావా యజ్డి స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ యాత్ర చేపట్టారు.

Maharashtra: బాలికపై పదిహేనేళ్ల బాలుడి హత్యాచారం.. బాలిక తండ్రిపై ప్రతీకారం తీర్చుకునేందుకు దారుణం

ఈ యాత్ర సందర్భంగా బ్రాహ్మణి బైక్ నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సొంతంగా బైక్ నడుపుతూ అంతదూరం జర్నీ చేసిన బ్రాహ్మణిని నెటిజన్లు అభినందిస్తున్నారు. అందులోనూ చాలా కఠినమైన వాతావరణంలో, పర్వత ప్రాంతంలో బైక్ రైడ్ చేయడం చాలా కష్టం. అలాంటి చోట్ల బైక్ రైడ్ చేసి బ్రాహ్మణి వావ్ అనిపించుకుంటోంది. యాత్ర సందర్భంగా ఆమె థక్ సే ఆరామానికి చేరుకుని అక్కడ పలువురు బౌద్ధ భిక్షువులను కలుసుకున్నారు. బ్రాహ్మణికి బైక్ రైడింగ్ అంటే ఇష్టమని తెలుస్తోంది. ఆమె ప్రొఫెషనల్ బైకర్ కూడా. నారా బ్రాహ్మణి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

అటు వ్యాపారవేత్తగా రాణిస్తూనే, అప్పుడప్పుడూ రాజకీయ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో తన భర్త లోకేష్ తరఫున ప్రచారం కూడా నిర్వహించారు. తన తండ్రి నందమూరి బాలకృష్ణకు సంబంధించిన సినిమా ఫంక్షన్లలోనూ అప్పుడప్పుడూ కనిపిస్తుంటారు.