Nara Lokesh : వైఎస్ వివేకా హత్య కేసులో ఇద్దరబ్బాయిలు జైలుకు వెళ్ళడం ఖాయం : నారా లోకేశ్

రైతులకు మీటర్లు బిగించాలని ఎవరైనా చూస్తే మీటర్లను పగలగొట్టాలని సూచించారు. ప్రతి సంవత్సరం రైతులకు రూ.20 వేలు పంట సాయం చేస్తామని చెప్పారు.

Nara Lokesh : వైఎస్ వివేకా హత్య కేసులో ఇద్దరబ్బాయిలు జైలుకు వెళ్ళడం ఖాయం : నారా లోకేశ్

Nara Lokesh (2)

Lokesh Criticized Jagan : మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఎన్టీఆర్ అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మినీ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద పీట వేశామని తెలిపారు. యువతను, నిరుద్యోగులను జగన్ మోహన్ రెడ్డి మోసం చేశాడని విమర్శించారు. ఐదు సంవత్సరాలలో 20లక్షల ఉద్యోగాలను ఏర్పాటు చేసేలా టీడీపీ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు.

రైతులకు మీటర్లు బిగించాలని ఎవరైనా చూస్తే మీటర్లను పగలగొట్టాలని సూచించారు. ప్రతి సంవత్సరం రైతులకు రూ.20 వేలు పంట సాయం చేస్తామని చెప్పారు. సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి జగన్ మోసం చేశాడని విమర్శించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. పోలీసులకు రావాల్సిన బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. ఈ మేరకు గురువారం వైస్సార్ కడప జిల్లా ప్రొద్దటూరులో చేపట్టిన యువగళం పాదయాత్రలో లోకేశ్ మాట్లాడారు.

Nara Lokesh : పాదయాత్రలో నారా లోకేశ్‌పై దాడి.. ప్రొద్దుటూరులో ఉద్రిక్తత

లక్ష కోట్ల ప్రజాధనాన్ని కొట్టేసిన వాడు పేదవాడు అవుతాడా? ఒక ఛానల్, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఊరికొక ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఐదు సంత్సరకాలంగా ప్రజల ఆదాయం రెట్టింపు చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు. కరెంట్ చార్జీలు 8 సార్లు పెంచి, ఆర్టీసీ చార్జీలు, పెట్రోలు, ఇంటి పన్ను, చెత్త పన్నులు వేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు.

బల్లపైన ఒక బటన్ నొక్కి పది రూపాయలు వేసి బల్ల కింద బటన్ నొక్కి వంద రూపాయలు నొక్కేస్తూన్నాడని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్యలో జగన్ పాత్ర ఉందని సీబీఐ కూడా చెప్పిందన్నారు. బాబాయ్ (వైఎస్ వివేకా) ఆత్మ వారిని వదిలిపెట్టదని తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఇద్దరబ్బాయిలు జైలు కు వెళ్ళడం ఖాయం అన్నారు.

Telangana Govt : కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని.. కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

బీసీలపైన దాడులు, దొంగ కేసులు ఎక్కువయ్యాయని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీల కోసం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలా ప్రత్యేక చట్టం తెస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ అనంత బాబు దళిత వ్యక్తిని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడని ఆరోపించారు. వైసీపీ నాయకుల వేధింపుల వల్ల మైనారిటీలు ఏంతో మంది అత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. టీడీపీ అధికారలోకి వచ్చాక మైనారిటీల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ప్రొద్దటూరును క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఇసుక అక్రమ రవాణా, దొంగ నోట్లుకు అడ్డాగా ఎమ్మెల్యే రాచమల్లు చేశాడని విమర్శించారు. గతంలో రవాణా శాఖ అధికారుల వేషం వేసుకుని డబ్బు రాబట్టిన ఘనత ప్రొద్దటూరు ఎమ్మెల్యే బెట్టింగ్ ప్రసాద్ రెడ్డిదని అన్నారు. ఆర్బీకే రాచమల్లు, బంగారు రెడ్డి, కిరణ్ రెడ్డి అనే ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రొద్దుటూరు ను కేక్ లా కట్ చేసి ముక్కలుగా పంచుకున్నారని విమర్శించారు.

Polavaram Project : పోల‌వ‌రంపై ముగిసిన కీల‌క స‌మావేశం..

చౌతపల్లే వద్ద కోట్ల రూపాయల భూమిని ఎమ్మెల్యే బినామిల పేరుతో కొట్టేశారని పేర్కొన్నారు. బీసీ నేత నందం సుబ్బయ్యను అతి కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రజనీ దొంగనోట్ల చలామణి చేస్తూ దొరికిపోయారని తెలిపారు. ప్రభుత్వ ఇంటి స్థలాల కోసం తక్కువ రేటుకు పనికిరాని భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి 40 లక్షల రూపాయలు ఎమ్మెల్యే తీసుకున్నారని తెలిపారు.

వీటి అన్నింటిపై టీడీపీ అధికారంలోకి వచ్చాక సిట్ వేస్తి, అన్ని కక్కిస్తామని పేర్కొన్నారు. ప్రొద్దటూరులో మరో అరాచక శక్తి బంగారు రెడ్డి.. మునిస్పాలిటిలో ఆయనది సింగిల్ టెండర్ అన్నారు. ఎమ్మెల్యే సోదరుడు కిరణ్ రెడ్డి ఒక పెద్ద భూ కబ్జాదారుడని.. ఎక్కడ ప్రభుత్వ, పేదల భూమి ఉన్నా కొట్టేయడమే ఆయన పని అని విమర్శించారు.