Nellore GGH Hospital : నెల్లూరు జీజీహెచ్, బదిలీ కాదు..శిక్షించాలి – బాధితులు

కామవాంఛతో కూతురు వయసు విద్యార్థినిని వేధించిన నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ పాపం పండింది. 10 టీవీ కథనాలపై స్పందించిన ప్రభుత్వం రెండు కమిటీలతో విచారణ జరిపించింది. లోతైన దర్యాప్తు చేసిన కమిటీలు వేధింపులు నిజమేనని తేల్చాయి. దీంతో సూపరింటెండెంట్‌పై సర్కార్‌ వేటు వేసింది. ఆయనను తిరుపతి రుయా ఆసుపత్రికి ఆయనను బదిలీ చేసింది సర్కార్.

Nellore GGH Hospital : నెల్లూరు జీజీహెచ్, బదిలీ కాదు..శిక్షించాలి – బాధితులు

Ggh

Superintendent Doctor Prabhakar : కామవాంఛతో కూతురు వయసు విద్యార్థినిని వేధించిన నెల్లూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ పాపం పండింది. 10 టీవీ కథనాలపై స్పందించిన ప్రభుత్వం రెండు కమిటీలతో విచారణ జరిపించింది. లోతైన దర్యాప్తు చేసిన కమిటీలు వేధింపులు నిజమేనని తేల్చాయి. దీంతో సూపరింటెండెంట్‌పై సర్కార్‌ వేటు వేసింది. ఆయనను తిరుపతి రుయా ఆసుపత్రికి ఆయనను బదిలీ చేసింది సర్కార్.

నెల్లూరు సూపరింటెండెంట్‌ హౌస్‌ సర్జన్‌ను లైంగికంగా వేధించిన ఆడియో టేపులను 10టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. ప్రభాకర్‌ కీచక పర్వాన్ని బయటపెట్టింది. దీంతో ఏపీ సర్కార్‌ సూపరింటెండెంట్‌పై ఎంక్వైరీకి రెండు కమిటీలను నియమించింది. డీఎంఈ కమిటీ, డిస్ట్రిక్ట్ కమిటీలు లైంగిక వేధింపుల ఘటనపై లోతుగా దర్యాప్తు చేశాయి. విద్యార్థునులపై లైంగిక వేధింపులు నిజమేనని తేల్చాయి. ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంతో ప్రభాకర్‌పై బదిలీ వేటు పడింది.
వేధింపులకు సంబంధించిన ఫోన్‌ కాల్‌లో ఉన్న వాయిస్ తనది కాదని ప్రభాకర్ చెబుతున్నారని.. దానిపై విచారణ చేస్తున్నామన్నారు డీఎంఈ రాఘవేంద్రరావు.

అందుకే ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టకుండా బదిలీ చేశామన్నారు. అటు సోమవారం మరో నివేదిక వస్తుందని.. ఆ రిపోర్ట్‌ ఆధారంగా ప్రభాకర్‌పై మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్ సింఘాల్ తెలిపారు.
ప్రభాకర్‌పై వేటు పడటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ బదిలీతో సరిపెట్టకుండా అతడిని శిక్షించాలని కోరుతున్నారు. అప్పుడే ప్రభాకర్‌ ఎవరిపైనా వేధింపులకు పాల్పడకుండా ఉంటాడని చెబుతున్నారు.

Read More : Etela Rajender Vs Communist Leaders : ఈటల వ్యాఖ్యలపై కామ్రేడ్ల గరం గరం