Nimmala Rama Naidu : అంబటి రాంబాబు మంత్రో కాదో అర్థం కావడం లేదు-నిమ్మల రామానాయుడు

అంబటి రాంబాబు.. నీటి పారుదల శాఖ మంత్రో లేక అవగాహన లేని మంత్రో అర్ధం కావట్లేదన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ పై అవగాహన లేకుండా..

Nimmala Rama Naidu : అంబటి రాంబాబు మంత్రో కాదో అర్థం కావడం లేదు-నిమ్మల రామానాయుడు

Nimmala Rama Naidu

Nimmala Rama Naidu : పోలవరం ప్రాజెక్ట్ పై ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ శాసనసభాపక్ష నేత నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. మంత్రి అంబటి రాంబాబు.. నీటి పారుదల శాఖ మంత్రో లేక అవగాహన లేని మంత్రో అర్ధం కావట్లేదన్నారు. మంత్రి అంబటి రాంబాబు పోలవరం డయాఫ్రమ్ వాల్ పై అవగాహన లేకుండా మాట్లాడారని నిమ్మల రామానాయుడు అన్నారు. అధికారంలోకి వచ్చిన రోజే సీఎం జగన్.. పోలవరం ప్రాజెక్ట్ పై విషం చిమ్ముతూ పక్కన పెట్టేశారని ఆరోపించారు.

2020 కి పూర్తవ్వాల్సిన ప్రాజెక్టును 2019 మే లోనే ఎందుకు అర్ధాంతరంగా నిలిపివేశారని ఆయన ప్రశ్నించారు. కొత్త ఏజెన్సీ లేకుండా ఉన్న ఏజెన్సీని రద్దు చేయటం దేనికి సంకేతం? అని అడిగారు. స్పిల్ వే నుంచి 50 లక్షల క్యూసెక్కుల నీరు మళ్లించే సామర్థ్యం అందుబాటులో ఉండగా ఫ్లడ్ మేనేజ్ మెంట్ ని గాలికొదిలేశారని విమర్శించారు.(Nimmala Rama Naidu)

Andhra pradesh : క్యాసినో స్టార్ కొడాలి నాని విశ్వరూపం అంటే అధికారులపై దాడులు చేయించటమా :నారా లోకేశ్

కాంట్రాక్ట్ ఏజెన్సీని మార్చుకుంటూ పోతే ప్రాజెక్టు భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ఉన్న వాటితోనే పనులు పూర్తి చేయమని పీపీఏ సీఈవో పంపిన హెచ్చరికను బేఖాతరు చేశారని అన్నారు. 2020 వరదల్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని ఉంటే రెండేళ్లు ఎందుకు దాచి పెట్టారని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. 2021 డిసెంబర్ కి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎందుకు అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు చెప్పారని అడిగారు.

కాగా.. జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంబటి రాంబాబు.. ఏపీకి పోలవరం ముఖ్య‌మైన ప్రాజెక్ట్ అని, అది ఏపీకి వరమ‌ని చెప్పారు. ఆ ప్రాజెక్టుతో రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఆ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తాన‌ని అన్నారు. ఆ ప్రాజెక్టును రీ-డిజైనింగ్ చేసే పరిస్థితులు ఎందుకు వచ్చాయని ఆయ‌న నిల‌దీశారు. డయాఫ్రమ్ దెబ్బతిన్న సందర్భాలు ఏ ప్రాజెక్ట్‌లోనూ లేవని, గత ప్రభుత్వ తప్పిదాలే ఈ ప‌రిస్థితుల‌కు కారణమ‌ని అంబటి రాంబాబు ఆరోపించారు.

Sajjala On Chandrababu : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు మళ్లీ రాకూడదు – సజ్జల

డయాఫ్రమ్‌తో ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం దాదాపు రూ. 2,100 కోట్లు అవ‌స‌రం అవుతాయ‌ని నిపుణులు అంచనా వేశార‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో స్పిల్ వే పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని హడావుడిగా పూర్తి చేసి బిల్లులు డ్రా చేసేశారని ఆయ‌న ఆరోపించారు. నాటి సీఎం చంద్రబాబు నాయుడి ధనదాహం వల్లే ఈ ప‌రిస్థితి దాపురించింద‌ని విమ‌ర్శించారు. అలాగే, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు కూడా దీనికి ‌కారణమ‌ని అంబటి రాంబాబు అన్నారు.

కాగా, జలవనరుల శాఖ మంత్రిగా త‌న‌కు జ‌గ‌న్ మంచి అవకాశం ఇచ్చార‌ని, వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన జలయజ్ఞాన్ని పూర్తి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న‌ అన్ని‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామ‌ని, ఏపీ రైతులకి నీరు అందించ‌డానికి కృషి చేస్తున్న జగన్ కు తామంతా అండ‌గా ఉంటామ‌ని అంబ‌టి రాంబాబు చెప్పారు.