AP High Court : నెల్లూరు కోర్టు చోరీ కేసు సీబీఐ విచారణకు ఎందుకు ఇవ్వకూడదన్న హైకోర్టు..అభ్యంతరం లేదన్న ఏపీ ప్రభుత్వం

నెల్లూరు కోర్టులో చోరీ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించి..విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకు ఎందుకు అప్పగించకూడదు? అని ప్రశ్నించింది. దీనికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

AP High Court : నెల్లూరు కోర్టు చోరీ కేసు సీబీఐ విచారణకు ఎందుకు ఇవ్వకూడదన్న హైకోర్టు..అభ్యంతరం లేదన్న ఏపీ ప్రభుత్వం

No Objection For Cbi Probe On Nellore Court Theft Case Says Ap Government To High Court

AP High Court.. Lobby case in Nellore court CBI investigation : నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. విచారణ చేపట్టింది. ఈ సందర్భంగాకోర్టు  ఏపీ ప్రభుత్వాన్ని పలు కీలక ప్రశ్నలు వేసింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకు ఎందుకు అప్పగించకూడదు? అని ప్రశ్నించింది. దీనికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదు అని ఏపీ ప్రభుత్వం ధర్మాసానినికి మంగళవారం (ఏప్రిల్ 26,2022)న వెల్లడించింది.

కాగా నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొని స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ కేసును సీబీఐ విచారణకు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని ఏజీ హైకోర్టుకు తెలిపారు. దీంతో సీబీఐ డైరెక్టర్, డీజీపీ, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసు విచారణను మే 6తేదీకి వాయిదా వేసింది.

Also read : NELLORE COURT CASE: నెల్లూరు కోర్టులో చోరీ కేసు.. నిందితుల అరెస్టు

కాగా..టీడీపీ నేతల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం పైళ్లు నెల్లూరు కోర్టులో చోరీకి గురి అయిన విషయం తెలిసిందే. కోర్టు ఆవరణలో చోరీ కేసులో ఏప్రిల్ 17 ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సయ్యద్ హయత్ , ఖాజా రసూల్ ను అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ విజయరావు తెలిపారు.కోర్టు ప్రాంగణంలో ఇనుము చోరీ కోసం వచ్చిన నిందితులు కుక్కలు వెంబడించడంతో కోర్టు ఆవరణలోకి వెళ్లినట్టుగా పోలీసులు చెప్పారు.

కోర్టు తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారని SP వివరించారు.. కోర్టు లోపల ఉన్న బీరువాలో బ్యాగును తీసుకెళ్లారన్నారు. కోర్టులో చోరీకి గురైన అన్ని వస్తువులను రికవరీ చేశామన్నారు.కోర్టులో నిందితులు తీసుకెళ్లిన బ్యాగ్ నుండి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ తీసుకొని మిగిలిన వాటిని నిందితులు పారేశారని ఎస్పీ విజయారావు వెల్లడించారు. కానీ  పోలీసులు చెప్పింది వట్టి కట్టు కథ అని పోలీసులు కుక్క కథలు భలే అల్లి చెప్పారంటూ పలు విమర్శలు వెల్లువెత్తాయి.

నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలోని 4వ అదనపు కోర్టులో ఈ నెల 14న చోరీ జరిగింది.ఈ చోరీలో పలు కేసులకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోర్టులో దాఖలు చేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు చోరీకి గురయ్యాయని ప్రచారం సాగుతుంది. ఈ కేసుతో పాటు ఇతర కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా చోరీకి గురి కావడం కలకలం రేపుతుంది.

Also read : Chiranjeevi : టికెట్ రేట్లు పెంచమని ప్రభుత్వాలని అడిగితే తప్పులేదు

మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని కాకాని గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలనూ ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, ఈ నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన పత్రాలు ఫోర్జరీవిగా పోలీసులు గుర్తించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి తెచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీవి అని తేలిందని ఫోరెన్సిక్ లేబోరేటరీ తేల్చింది. అసలు సోమిరెడ్డి మలేషియాకు వెళ్లలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధృవీకరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో కొందరిని అరెస్టు కూడా చేశారు. ఈ మేరకు పలువురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చార్జీషీట్ ను కూడా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో భద్రపర్చారు. ఈ కేసుపై గత వారంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ కేసుపై సీబీఐ విచారణకు కూడా తాను సిద్దంగా ఉన్నానని కూడా ప్రకటించారు. ఈక్రమంలోనే కోర్టులో భద్రపరిచిన పలు కీలక ఆధారాలు చోరీకి గురి కావటం విశేషంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కట్టు కథలు చెప్పారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.