Nara Lokesh Padayatra: నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రకు లభించని అనుమతి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న ‘యువగళం‘ పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడపీ జనవరి (2023)12న పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. డీజీపీ, హోంసెక్రటరీ, చిత్తూరు ఎస్పీ, పలమనేరు, పూతలపట్టు డీఎస్పీలకు కూడా టీడీపీ లేఖలు రాసింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరింది. కానీ ఇప్పటి వరకు పోలీసుల శాఖ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.

Nara Lokesh Padayatra
Nara Lokesh Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న ‘యువగళం‘ పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడపీ జనవరి (2023)12న పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. డీజీపీ, హోంసెక్రటరీ, చిత్తూరు ఎస్పీ, పలమనేరు, పూతలపట్టు డీఎస్పీలకు కూడా టీడీపీ లేఖలు రాసింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరింది. కానీ ఇప్పటి వరకు పోలీసుల శాఖ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో అనుమతి లభించినా లభించకపోయినా లోకేశ్ పాదయాత్ర జరుగుతుందని టీడీపీ చెబుతోంది.
కాగా నారా లోకేశ్ రోజుకు 10కిలోమీటర్ల చొప్పున 400ల రోజుల పాటు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయటానికి రూట్ మ్యాప్ ఖారారు అయ్యింది. తేదీ, ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. జనవరి (2023) 27న తండ్రి, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పం నుంచే లోకేశ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. 27 మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం నియోజకవర్గం లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి యాత్ర ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రకు పోలీసు శాఖ అనుమతి కోరింది టీడీపీ. కానీ పోలీసు శాఖ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయినా పాదయాత్ర జరుగుతుందని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.