No Trace of Fisherman: కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు అదృశ్యం

కాకినాడ జిల్లా సముద్ర తీరంలో చేపలవేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించడంలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులతో సహా స్థానిక మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన నెలకొంది

No Trace of Fisherman: కాకినాడ తీరంలో సముద్రంలో వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు అదృశ్యం

Kakinada

No Trace of Fisherman: కాకినాడ జిల్లా సముద్ర తీరంలో చేపలవేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించడంలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులతో సహా స్థానిక మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కాకినాడ పర్లోపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు మార్చి 30న సముద్రంలో వేటకు వెళ్లారు. ఈక్రమంలో సముద్రంలోకి వెళ్లిన అనంతరం బోటు చెడిపోయిందంటూ మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులకు చివరిసారిగా సమాచారం అందించారు మత్స్యకారులు. అదే సమయంలో వారి వద్దనున్న సమాచార వ్యవస్థ చెడిపోవడంతో పాటు సెల్ ఫోన్స్ కూడా పనిచేయడంలేదు.

Also read:AP Govt: కొత్త జిల్లాల ఏర్పాటు.. రిజిస్రేషన్ చార్జీలు పెంచిన ప్రభుత్వం!

దీంతో వారి ఆచూకీపై ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు కాకినాడ జిల్లా కొత్త కలెక్టర్ కృతిక శుక్లాను ఆశ్రయించి సహాయం చేయాలనీ కోరారు. దీనిపై రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం..సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరగా వచ్చిన సమాచారం మేరకు..చేపల వేటకు వెళ్లిన బోట్ ఇంజిన్ చెడిపోవడంతో..బోట్ కాకినాడ తీరం నుంచి విశాఖపట్నం భీమిలి వైపు కొట్టుకుని వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచార ఇచ్చారు మత్స్యకారులు. తమ వారి ఆచూకీపై మత్స్యకార కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:Telangana : తాగుబోతు భర్తను హత్యచేసిన అత్తింటివారు