Marriage Cheating : గుంటూరులో ఎన్నారై నిత్యపెళ్లి కొడుకు అరెస్ట్

మహిళలను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్న ఎన్ఆర్ఐ నిత్య పెళ్ళికొడుకు సతీష్ బాబును గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

Marriage Cheating : గుంటూరులో ఎన్నారై  నిత్యపెళ్లి కొడుకు అరెస్ట్

Guntur Nri Bride Groom Arrest

Marriage Cheating :  మహిళలను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్న ఎన్ఆర్ఐ నిత్య పెళ్ళికొడుకు సతీష్ బాబును గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు అతడిని గుంటూరు ఎక్సైజ్ కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశ పెట్టగా న్యాయమూర్తి  14రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు నిందితుడిని జిల్లా జైలుకు తరలించారు.

ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకుని తనను ఐదో పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు ఐదో భార్య చేసిన ఫిర్యాదుతో పోలీసులు సతీష్ బాబును అరెస్ట్ చేశారు. సతీష్ కు ఇంతకు ముందే పెళ్లి అయి విడాకులు తీసుకున్నాడని… మంచివాడని బెంగుళూరులో తెలిసిన వాళ్లు చెప్పగా పెళ్లి కుదుర్చుకున్నట్లు ఐదో భార్య తెలిపింది.

జూన్ 16న కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం జరిగిందని. జూలై 2న సతీష్ వ్యవహారం అనుమానం వచ్చి గూగుల్ లో సెర్చ్ చేయగా అతని బండారం బయటపడిందని ఆమె తెలిపింది. అన్ని ఆధారాలు సేకరించి దిశపోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు సతీష్ బాబును, అతని తండ్రి వీరభద్రరావును అరెస్ట్ చేశారు. సతీష్ పై గతంలోనే రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లిళ్ల పేరుతో మోసం చేసిన ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలకు సంబంధించి కేసులు నమోదౌతున్నాయి. 11 మందిని వివాహం చేసుకొన్న ఆరోపణలతో గుంటూరు జిల్లా బేతపూడి కి చెందిన అడపా శివశంకర్ బాబు అనే వ్యక్తిని ఈ నెల 14న మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను శివశంకర్ బాబు ఖండించారు.

అయితే బాధిత మహిళల ఫిర్యాదు మేరకు శివశంకర్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకొన్న మహిళల నుండి డబ్బులు తీసుకొని తప్పించుకొని తిరిగేవాడని కూడా బాధితులు తెలిపారు. ఈ విషయమై బాధిత మహిళలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అంతేకాదు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.  ఈకేసు దర్యాప్తులో ఉంది.

మరో వైపు ఓ మహిళ కూడా తన వయస్సు కన్పించకుండా మేకప్ వేసుకొని తన వయస్సును దాచి పెట్టి పెళ్లి చేసుకొన్న ఘటన ఇటీవలనే చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. 50 ఏళ్ల మహిళ మేకప్ సమాయంతో తన వయస్సును దాచి పెట్టి పెళ్లి చేసుకొంది. ఈ మహిళ విషయం తెలిసిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మహిళకు అప్పటికే రెండు పెళ్లిళ్లు అయినట్టుగా పోలీసులు గుర్తించారు. ఏది ఏమైనా పెళ్లిళ్ల పేరుతో జరుగుతున్న మోసాలు ఇటీవల   పెద్ద సంఖ్యలో  వెలుగు చూస్తున్నాయి.

Also Read : VANPIC : వాన్‌పిక్ కేసులో సీఎం జగన్‌తో సహా పలువురికి ఊరట