Odisha Andhra Border: సరిహద్దు వివాదం.. ఏపీ అధికారులతో ఒడిశా పోలీసుల వాగ్వాదం!

ఆంధ్రా, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. చాలా కాలంగా జరుగుతున్న ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంలో రెండు రాష్ట్రాలు పంతానికి పోతున్నాయి.

Odisha Andhra Border: సరిహద్దు వివాదం.. ఏపీ అధికారులతో ఒడిశా పోలీసుల వాగ్వాదం!

Odisha Andhra Border

Odisha Andhra Border: ఆంధ్రా, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. చాలా కాలంగా జరుగుతున్న ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంలో రెండు రాష్ట్రాలు పంతానికి పోతున్నాయి. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని 23 కోటియా గ్రూప్‌ ఆఫ్‌ విలేజెస్‌‌పై ఒడిశా పెత్తనం చెలాయిస్తోంది. ఆ గ్రామాలన్నీ తమవేనంటూ ఒడిశా వితండవాదం చేస్తుంటే.. ఆంధ్రా అధికారులు ఆ గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమవుతోంది.

TDP vs YSRCP: ఎన్టీఆర్ భవన్‌పై దాడిలో 10 మంది.. పట్టాభి ఇంటిపై దాడిలో 11 మంది అరెస్ట్!

ఏపీ అధికారులు గతంలో ఆ గ్రామాలలోకి వెళ్లే వీలు లేకుండా రోడ్డుకు అడ్డంగా కర్రలతో దడి కట్టి అడ్డుకోగా ఈ మధ్య కాలంలో కాస్త ఈ సరిహద్దు వివాదం సద్దుమణిగింది. కాగా, ఇప్పుడు ఏపీ అధికారులు ఆయా గ్రామాలలో కరోనా టీకాలు వేసేందుకు వెళ్లడంతో మరోసారి ఒడిశా పోలీసులు ఏపీ అధికారులను అడ్డుకున్నారు. కోటియా గ్రామాలు తమవేనని ఒడిశా ప్రభుత్వం ప్రకటించగా.. ఆ గ్రామాల్లో ప్రజలకు టీకా వేసేందుకు వెళ్లిన ఏపీ మెడికల్ సిబ్బందిని ఒడిశా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అడ్డుకున్నారు.

Earthquake : ఉత్తర తెలంగాణలో భూకంపం

తరచుగా ఒడిశా ప్రభుత్వం ఈ విషయంలో అత్యుత్సాహంగానే ముందుకెళ్తుండగా గతంలో పలుమార్లు 23 గ్రామాల్లో ఒడిశా పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించి ప్రజలను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ గ్రామాల్లో ఆంధ్రా పోలీసులు లేకపోవడంతో ఆయా గ్రామాల్లోకి వెళ్లడానికి ఆంధ్రా అధికారులు, ప్రజాప్రతినిధులు సాహసించడం లేదు. అప్పుడప్పుడు ఇలా అధికారిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం తరపున ప్రతినిధులు వెళ్లినా ఒడిశా అధికారులు, పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.