Srisailam Project : 14 ఏళ్ల తర్వాత మళ్లీ జులైలో తెరుచుకున్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు

శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

10TV Telugu News

Srisailam project : శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడం.. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు రెండు క్రస్టుగేట్లను అధికారులు ఎత్తారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అధికారులతో కలిసి ప్రాజెక్టు 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు.

నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. క్రస్టుగేట్ల గుండా దాదాపు 40 వేల క్యూసెక్కులు నాగార్జున సాగర్‌ వైపు వెళ్తోంది. తెలుగు రాష్ట్రాలకు నీటి కష్టాలు తీరనున్నాయి. ఇన్‌ఫ్లోను బట్టి అర్ధరాత్రి వరకు 10 గేట్లను ఎత్తనున్నట్లు శ్రీశైలం ప్రాజెక్ట్‌ ఎస్‌ఈ వెంకట రమణయ్య తెలిపారు.

14 ఏళ్ల తర్వాత మళ్లీ జులైలో శ్రీశైలం గేట్లు తెరుచుకున్నాయి. జులైలో గేట్లు ఎత్తడం 2007 తర్వాత ఇదే తొలిసారి. 2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే ఛాన్స్ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 4.65 లక్షల క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.50 అడుగులుగా ఉంది.

ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నిండటంతో ఇక వచ్చిన వరద వచ్చినట్లు నాగార్జున సాగర్‌కు చేరనుంది. ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో వారం రోజుల్లో నాగార్జున సాగర్‌ సైతం నిండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

10TV Telugu News