Ongole Lok Sabha Constituency : రంకెలేసే రాజకీయం.. కులం చుట్టూ తిరిగే సమీకరణాలు.. ఒంగోలు రాజకీయాల్లో హోరాహోరీగా గిత్తలపోరు

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాలినేనిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయ్. మంగమూరు రోడ్డులోని వందల కోట్లు విలువ చేసే భూమి విషయంలో జరిగిన అక్రమాల వెనక బాలినేని హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్.

Ongole Lok Sabha Constituency : రంకెలేసే రాజకీయం.. కులం చుట్టూ తిరిగే సమీకరణాలు.. ఒంగోలు రాజకీయాల్లో హోరాహోరీగా గిత్తలపోరు

Ongle Lok Sabha Constituency

Ongole Lok Sabha Constituency : పంతానికి వస్తే ఎంతదూరం వెళ్లేందుకైనా సిద్ధం అన్నట్లు ఉంటాయ్ ప్రకాశం జిల్లా పాలిటిక్స్‌. అందులోనూ ఒంగోలు అంటే.. మరీ ప్రత్యేకం. రంకెలేసే రాజకీయం.. కులం చుట్టూ తిరిగే సమీకరణాలు.. రాజుకునే మంటలు.. ఒంగోలును హాట్‌టాపిక్‌గా మారుస్తాయ్. తూర్పున సముద్రం.. పశ్చిమాన నల్లమల అడవులతో ప్రశాంత వాతావరణానికి కేరాఫ్‌ అనిపించే ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్‌లో రాజకీయం..అందరిలో చెమట్లు పట్టిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట అయిన ఒంగోలులో.. ఇప్పుడు హస్తం పార్టీ అడ్రస్‌ లేకుండా పోయింది. జనసేనకు బలం లేదు. వైసీపీ, టీడీపీ మధ్యే ప్రధాన పోటీ ఖాయంగా కనిపిస్తోంది. 2019లో ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని 7 స్థానాల్లో ఆరింట్లో విజయం సాధించిన వైసీపీ.. ఈసారి పట్టు నిలుపుకుంటుందా.. ఫ్యాన్‌ పార్టీకి ఎదురుగాలి వీస్తోందా.. కొరకరాని కొయ్యలా ఉన్న ఒంగోలు స్థానాన్ని టీడీపీ చేజిక్కించుకుంటుందా.. రెండు పార్టీలను కామన్‌గా ఇబ్బంది పెడుతున్న విషయాలు ఏంటి.. పార్టీలు గెలుపు గిత్తలు అనుకుంటున్న అభ్యర్థులు ఎవరు..

SUBBAREDDY, RAGHAVARAO, SRINIVASREDDY

SUBBAREDDY, RAGHAVARAO, SRINIVASREDDY

ఒంగోలుపై వైసీపీ పట్టు నిలుపుకుంటుందా ? సైకిల్ పార్టీ మళ్లీ పరుగులు పెడుతుందా? వైసీపీ, టీడీపీ బరిలోకి దింపబోయే గిత్తలెవరు?
రాజకీయాలందు ఒంగోలు రాజకీయం వేరయా అంటారు.. అక్కడి పాలిటిక్స్ తెలిసినవాళ్లు ఎవరైనా ! పూటకో ట్విస్టుతో.. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా అనిపిస్తుంటుంది అక్కడ ! ఏపీ రాజకీయం ప్రస్తావన వచ్చిన ప్రతీసారి.. ప్రకాశం జిల్లా, ముఖ్యంగా ఒంగోలు నుంచే చర్చ మొదలవుతుంది. ప్రశాంత వాతావరణంలో రాజకీయం సమరం.. ప్రతీసారి ప్రత్యేకమే అనిపిస్తుంటాయ్ ఇక్కడి పాలిటిక్స్. 2019 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకున్న వైసీపీ.. కొండెపి మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. మరి ఒంగోలు మీద వైసీపీ పట్టు నిలుపుకుంటుందా.. సైకిల్‌ జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెడుతుందా.. జరుగుతుంది ఏంటి.. జరగబోయేది ఏంటనే ఆసక్తి ఒంగోలులో కనిపిస్తోంది. ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్నా.. రెండు పార్టీలు ఇప్పటి నుంచే అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయ్. కుల సమీకరణాలకు అనుగుణంగా.. పావులు కదుపుతున్నాయ్. ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో వైసీపీ, టీడీపీని ఇప్పుడు కామన్‌గా ఒకే విషయం ఇబ్బంది పెడుతోంది.

సిట్టింగ్ ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. 2024లో కుమారుడిని బరిలోకి దింపే ఆలోచన..ఆర్థిక, అంగ బలం ఉన్న నాయకుడి కోసం టీడీపీ అన్వేషణ
వాయిస్ 2 : ఒంగోలు పార్లమెంట్‌ మొదటినుంచి కాంగ్రెస్‌కు కంచుకోట. మొదటిసారి ఇక్కడ 1952లో ఎన్నికలు జరగగా.. కేవలం రెండుసార్లు మాత్రమే టీడీపీ విజయం సాధించింది. 1984లో బెజవాడ పాపిరెడ్డి, 1999లో కరణం బలరాం టీడీపీ తరఫున విజయం సాధించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత.. జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఫ్యాన్‌ పార్టీ హవానే కొనసాగింది. ఒంగోలు పార్లమెంట్‌కు ప్రస్తుతం మాగుంట శ్రీనివాసులు రెడ్డి సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రఘరామిరెడ్డిని ఎంపీ అభ్యర్ధిగా బరిలో నిలుస్తారని మాగుంట ప్రకటించారు. ఐతే వైవీ సుబ్బారెడ్డి రూపంలో ఆయనకు పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. తాను కానీ.. తన కుమారుడు కానీ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని జగన్‌ను ఎప్పటి నుంచో కోరుతున్నారు వైవీ సుబ్బారెడ్డి. ఐతే బాలినేని, వైవీ మధ్య ఒంగోలులో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయ్. దీంతో జగన్‌ ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఒంగోలులో ఎలాగైనా విజయం సాధించాలని టీడీపీ పావులు కదుపుతోంది. వైసీపీతో ఢీ అంటే ఢీ అనేలా ఆర్థిక, అంగ బలం ఉన్న నాయకుడి కోసం అన్వేషిస్తోంది. అధికార పార్టీకి చెందిన సామాజిక వర్గానిదే ఇక్కడ పైచేయి కావడంతో.. సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్ధిని ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉంది టీడీపీ. గత ఎన్నికల్లో సైకిల్ పార్టీ నుంచి పోటీ చేసిన శిద్ధా రాఘవ రావు.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఐతే అప్పటి నుంచి పార్లమెంట్ ఇంచార్జిని టీడీపీ నియమించలేదు. దీంతో పసుపు పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్నది క్వశ్చన్‌మార్క్‌గానే ఉంది.

READ ALSO : Chittoor Lok Sabha Constituency : చిత్తూరులో ఫ్యాన్ పార్టీ పట్టునిలుపుకుంటుందా?..అధికార పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ వ్యూహాలేంటి?

ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి, కనిగిరి, ఒంగోలు, కొండపి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. 2019 ఎన్నికల్లో ఆరు స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ.. ఈసారి పట్టు నిలుపుకోవడం అనుమానంగానే ఉంది. ఈ పార్లమెంట్‌ పరిధిలో అధికార పార్టీ క్రమంగా ప్రాభవం కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఒక్క యర్రగొండ పాలెం మినహా.. మిగతా నియోజకవర్గాల్లో గెలుపు వైసీపీకి అంత ఈజీ అయ్యే చాన్స్ లేదు. ఏడు నియోజకవర్గాల్లోనూ.. రెండు పార్టీలో వర్గపోరు పీక్స్‌కు చేరింది. వీటిని ఎలా సెట్‌రైట్ చేస్తారన్న దాని మీదే పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయ్‌.

Anna Venkata Rambabu

Anna Venkata Rambabu

గిద్దలూరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా అన్నా వెంకట రాంబాబు.. మూడు వర్గాలుగా విడిపోయిన వైసీపీ..
గిద్దలూరులో అన్నా వెంకట రాంబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో వైసీపీకి 80వేలకు పైగా ఓట్ల మెజారిటీ రాగా.. ఇప్పుడు అధికార పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఇక్కడ వైసీపీ మూడువర్గాలుగా విడిపోయింది. మొదటి నుంచి జెండా మోసిన తమను పట్టించుకోవడం లేదని ఓ వర్గం.. పార్టీ మారి వచ్చినా తమ పనులు కావడం లేదని ఇంకో వర్గం.. ఎలాగైనా తమ సామాజికవర్గానికే ఈసారి టికెట్ ఇవ్వాలని మరో వర్గం.. ఇలా గిద్దలూరులో గిత్తల పోరుకు మించి వైసీపీలో వర్గపోరు కనిపిస్తోంది.

tdp ashok reddy

tdp ashok reddy

READ ALSO : Guntur Lok Sabha Constituency : ఆంధ్రా రాజకీయాలకు సెంటర్ పాయింట్…గుంటూరు రాజకీయం మిర్చి కన్నా ఘాటు గురూ…

గిద్దలూరులో అభ్యర్థిని మార్చే యోచనలో వైసీపీ.. టీడీపీ ఇంచార్జి అశోక్ రెడ్డికి ఇక్కడ పాజిటివ్ వైబ్స్‌
గిద్దలూరులో కనిపిస్తున్న వర్గపోరుతో.. స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్రంగా కలత చెందుతున్నారు. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు కార్యక్రమంలోనూ ఆయన పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. అధిష్టానం నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. లోలోపల మాత్రం మంటలు రగులుతూనే ఉన్నాయ్. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి కథ తేలుస్తానంటూ ఎమ్మెల్యే రాంబాబు చేసిన వ్యాఖ్యలు.. పార్టీని మరింత వీక్‌ చేస్తున్నాయ్. దీనికితోడు వైసీపీలో ఇబ్బంది పడుతున్న నేతలు.. టీడీపీ ఇంచార్జి అశోక్ రెడ్డి వైపు క్యూ కడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అభ్యర్థిని మార్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే ఐవీ రెడ్డితో పాటు.. మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి కుమారుడు ప్రవీణ్ కుమార్‌ టికెట్ రేసులో ఉండే చాన్స్ ఉంది. ఇక టీడీపీ ఇంచార్జి అశోక్ రెడ్డికి ఇక్కడ పాజిటివ్ వైబ్స్‌ కనిపిస్తున్నాయ్. టీడీపీ టికెట్‌ రేసులో ఆయనతో పాటు మాజీ మంత్రి పిడతల రంగారెడ్డి కోడలు, మాజీ ఎమ్మెల్యే సాయి కల్పనా రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. టీడీపీ నుంచి అవకాశం దక్కకుంటే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానని కల్పనారెడ్డి ప్రకటించారు. అదే జరిగితే.. ఆ పరిణామం వైసీపీకి ప్లస్‌గా మారడం ఖాయం.

NARAYANAREDDY, NAGARJUNAREDDY

NARAYANAREDDY, NAGARJUNAREDDY

మార్కాపురంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిపై ఆరోపణలు.. అభ్యర్థిని మార్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం..
మార్కాపురంలో వైసీపీ నుంచి కుందూరు నాగార్జునరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ కూడా వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే బంధువులు మండలాలవారీగా పాలన సాగిస్తున్నారని.. నాగార్జునరెడ్డి డమ్మీ ఎమ్మెల్యే అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయ్. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారికి కాకుండా.. మధ్యలో చేరిన వారికి కార్పొరేటర్లుగా అవకాశం కల్పించారని.. సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయ్. దీంతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. మార్కాపురం జిల్లా ఏర్పాటులో ఎమ్మెల్యే విఫలం అయ్యారని కూడా ఆయన మీద విమర్శ ఉంది. ఇక్కడ అభ్యర్థిని మార్చే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డితో పాటు.. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన సూర్య ప్రకాష్ రెడ్డి టికెట్ కోసం జగన్ దగ్గర విన్నపాలు మొదలుపెట్టినట్లు టాక్‌. అటు జిల్లా ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన టీడీపీ నేత కందుల నారాయణ రెడ్డి జనాల్లో పుంజుకున్నారు. వరుసగా రెండుసార్లు ఓడిపోయారన్న సింపథీ కూడా కందుల మీద ఉంది. టికెట్ విషయంలో కందులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. జనాల మనసులకు చేరువకావడంలో విఫలం కావడం ఇక్కడ టీడీపీకి మైనస్‌. ఏమైనా మార్కాపురంలో ఈసారి ఢీ అంటే ఢీ అనే యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది.

READ ALSO : Nellore Lok Sabha Constituency : సింహపురిలో వైసీపీ పట్టు నిలుపుకుంటుందా ? నెల్లూరు టీడీపీలో కనిపిస్తున్న కొత్త జోష్

SURESH,DEVIDRAJU

SURESH,DEVIDRAJU

యర్రగొండపాలెం లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా మంత్రి ఆదిమూలపు సురేశ్‌.. టీడీపీ నుంచి టికెట్ రేసులో డేవిడ్ రాజు పేరు
యర్రగొండపాలెంలో.. వైసీపీ, టీడీపీలను వర్గ విభేదాలు టెన్షన్‌ పెడుతున్నాయ్. మంత్రి ఆదిమూలపు సురేష్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. బలమైన నేతలగా ఉండి మంత్రిగా చేసినా.. ఆదిమూలపు సురేష్‌ తమకు చేసిందేమీ లేదని మండలఅధ్యక్షులు, ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తితో ఉన్నారు. స్థానికంగా అభివృద్ధి, మౌలిక వసతులు కల్పనలో సురేష్‌ విఫలం అయ్యారనే చర్చ నడుస్తోంది. వెలుగొండ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తికాకపోవడంపై.. జనాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ ప్రభావం మంత్రిపై తీవ్రంగా పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్, పునరావాస కల్పన విషయంలో పెద్దరవీడు మండలంలోని ముంపు గ్రామాల జనాల నుంచి మంత్రికి తలనొప్పులు తప్పేలా లేవు. వైసీపీ నుంచి సురేష్‌ మళ్లీ బరిలోకి దిగడం ఖాయం. వరుసగా రెండుసార్లు ఓడిన బూదాల అజితారావును మార్చిన టీడీపీ.. గూడూరి ఎరిక్సన్ బాబుకు చాన్స్ ఇచ్చింది. ఐతే ఆదిమూలపు సురేష్‌ను ఎదుర్కొనే సామర్థ్యం ఎరిక్సన్ బాబుకు లేవనే భావన సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తోంది. టీడీపీ నుంచి టికెట్‌ రేసులో ఈ ఇద్దరితో పాటు మాజీ ఎమ్మేల్యే డేవిడ్ రాజు పేరు కూడా వినిపిస్తోంది. డేవిడ్‌కు టికెట్ లభిస్తే.. సురేష్‌కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

venugopal,ramesh

venugopal,ramesh

READ ALSO : Anakapalle Lok Sabha Constituency : పేరు మాత్రం సాఫ్ట్…రాజకీయం మాత్రం మస్త్ హాట్…అనకాపల్లిలో పోటాపోటీగా పొలిటికల్ వార్

దర్శి లో వర్గ విభేదాలతో వైసీపీలో టెన్షన్ టెన్షన్‌.. బూచేపల్లి వర్సెస్‌ మద్దిశెట్టి వర్గాల మధ్య యుద్ధం
ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో కీలక స్థానం.. దర్శి ! మద్దిశెట్టి వేణుగోపాల్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనవర్గంపై స్థానికంగా అవినీతి ఆరోపణలు వినిపిస్తుండగా.. జనాల్లోనూ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీనికితోడు వర్గ విభేదాలు పార్టీని షేక్‌ చేస్తున్నాయ్‌. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డికి, వేణుగోపాల్‌ వర్గాల మధ్య పోరు పీక్స్‌కు చేరింది. ఈ వివాదాలు టీడీపీకి ప్లస్‌ అవుతున్నాయ్. దర్శి మున్సిపాలిటీ సైకిల్ పార్టీ ఎగురేసుకోవడం వెనక ఇద్దరి మధ్య యుద్ధమే కారణం అనే చర్చ నడుస్తోంది. దర్శిలో మళ్లీ పోటీ చేసేది తానే అని వేణుగోపాల్ ధీమాగా ఉన్నా.. అభ్యర్థిని మార్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో టికెట్ కోసం శిద్ధా రాఘవరావు టికెట్‌ కోసం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బూచేపల్లి కూడా జగన్‌ ముందు విన్నపాలు వినిపిస్తున్నట్లు టాక్‌. ఇక్కడ టీడీపీ పరిస్థితి భిన్నంగా ఉంది. 2019లో సైకిల్ పార్టీ తరఫున పోటీ చేసిన కదిరి బాబారావు.. ఇప్పుడు వైసీపీ గూటికి చేరుకున్నారు. ఆ తర్వాత పమిడి రమేష్‌ను ఇంచార్జిగా నియమించిన చంద్రబాబు.. తర్వాత తొలిగించారు. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంది. దీంతో కేడర్ గందరగోళంలో పడిపోయింది. బూచేపల్లి, మద్దిశెట్టి వర్గాలు ఒక్కటిగా నడిస్తేనే పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. లేదంటే ప్రత్యర్థి పార్టీకి అవకాశం ఇచ్చినట్లే !

madhusudhan,narasimhareddy

madhusudhan,narasimhareddy

కనిగిరిలో బుర్రా మధుసూధన్‌కు వ్యతిరేక పవనాలు.. టీడీపీ ఇంచార్జి ఉగ్రనరసింహారెడ్డి వ్యూహాత్మక అడుగులు
రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉన్న కనిగిరిలో.. బుర్రా మధుసూధన్ యాదవ్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. రెడ్డి, యాదవ సామాజికవర్గాలను ఏకం చేసి నడిపించడంలో సక్సెస్ అయిన బుర్రా.. 2019లో 40వేలకు పైగా మెజారిటీ సాధించారు. ఐతే ఇప్పుడు ఎమ్మెల్యేకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయ్. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన తమను పక్కనపెట్టి సొంత సామాజిక వర్గ నేతలకు అనుకూలంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని.. రెడ్డి సామాజికవర్గ నేతలు గుర్రుగా ఉన్నారు. నియోజవర్గానికి బుర్రా మధుసూధన్ చేసిందేమీ లేదని.. జనాలకు పెద్దగా అందుబాటులో కూడా ఉండరనే విమర్శలు ఉన్నాయ్. బుర్రాను మార్చాలని స్థానిక రెడ్డి నేతలు.. వైసీపీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. కదిరి బాబురావుతో పాటు రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి టికెట్‌ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గతంలో రెడ్డి సామాజికవర్గం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న ఆయన.. వరుస భేటీలు నిర్వహిస్తూ వివాదాలు పరిష్కరించారు. రెడ్డి వర్గ నేతలను తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. నిత్యం జనాలకు అందుబాటులో ఉంటూ.. ఏడాదిలో 3వందల రోజులు అన్నదానాలు.. ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జనాల మనసు గెలుచుకుంటున్నారు. వైసీపీ వర్గ విభేదాలు ఇక్కడ టీడీపీ ప్లస్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయ్.

READ ALSO : Kakinada Lok Sabha Constituency : కాకినాడలో ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో తిరగనుందా?….ఈసారి ఎన్నికల్లో బలమైన కాపు సామాజిక వర్గం మద్దతు ఏపార్టీకి?

Srinivasareddy,janardhan

Srinivasareddy,janardhan

బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై తీవ్రస్ధాయి అవినీతి ఆరోపణలు.. టీడీపీ నుంచి బరిలో దామచర్ల జనార్ధనరావు
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాలినేనిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయ్. మంగమూరు రోడ్డులోని వందల కోట్లు విలువ చేసే భూమి విషయంలో జరిగిన అక్రమాల వెనక బాలినేని హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్. ఒంగోలుకు పెద్దగా చేసిందేమీ లేదనే విమర్శ కూడా ఉంది. బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి.. అన్నీ తానై నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలతో బాలినేనిని వేరే స్థానం నుంచి పోటీకి దింపాలా.. ఇక్కడి నుంచి ఆయన కుమారుడికి అవకాశం ఇవ్వాలా అనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు కనిపిస్తోంది. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన దామచర్ల జనార్ధనరావు.. ఓడిన తర్వాత జనాలకు, పార్టీ శ్రేణులకు పెద్దగా అందుబాటులో లేరు. టీడీపీ అధిష్టానం హెచ్చరించడంతో.. రెండు నెలలుగా యాక్టివ్ అయ్యారు. వైసీపీ మీద స్థానికంగా వ్యతిరేకత ఉన్నా.. దాన్ని ఏ స్థాయిలో అందుకుంటుంది అన్న దాని మీదే టీడీపీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయ్. పోల్‌మేనేజ్‌మెంట్‌లో దిట్ట అయిన బాలినేనికి.. దామచర్ల ఎలాంటి సవాల్‌ విసురుతారన్న దాని మీదే 2024 యుద్ధం ఆధారపడి ఉంటుంది.

swamy

swamy

కొండపిలో వైసీపికి కలసిరాని ప్రయోగాలు.. మరోసారి గెలిచేందుకు టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి వ్యూహాలు
ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన ఏకైన స్థానం.. కొండపి ! డోలా బాల వీరాంజనేయ స్వామి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. జనం మనిషిగా స్వామికి పేరు ఉంది. జనాల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూ.. తన పట్టు కాపాడుకుంటున్నారు. దామచర్ల సత్య కుటుంబం.. స్వామికి ఆర్థికంగా అండగా ఉంటోంది. మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు కూడా టీడీపీలో ఉండడంతో.. స్వామికి మళ్లీ ఎదురు లేదనే చర్చ జరుగుతోంది. ఇక్కడ ఎన్ని ప్రయోగాలు చేసినా వైసీపీకి కలిసిరావడం లేదు. 2019లో వైసీపీ తరఫున మాదాసి వెంకయ్య పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయననే ఇంచార్జిగా కొనసాగిస్తున్నా.. కేడర్‌ను తన వైపు తిప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత అశోక్‌బాబుకు బాధ్యతలు అప్పగించినా.. పార్టీ కేడర్ ఆయనకు కూడా సహకరించలేదు. దీంతో కొండెపి సమస్య కొండంత అయి కూర్చుంది. 2024లో ఇక్కడ అభ్యర్థిని మార్చాలని వైసీపీ శ్రేణుల నుంచి డిమాండ్‌ వినిపిస్తుండగా.. అధిష్టానమే ఈ స్థానం విషయంలో కన్ఫ్యూజన్‌లో పడిందని టాక్‌.

READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్‌గా మారిన అరకు.. ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు

2019లో జగన్‌ మేనియాలో.. ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో ఆరు స్థానాల్లో విజయం సాధించింది వైసీపీ ! ప్రస్తుత పరిణామాలు అంచనా వేస్తే.. ఆ ప్రాభవం క్రమంగా కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. యర్రగొండపాలెలంలో మినహా.. వైసీపీ గెలుపు ఖాయం అని టక్కున చెప్పలేని పరిస్థితి. మూడున్నరేళ్లలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. పార్టీలో విభేధాలు, ఆధిపత్య పోరు, నాయకులపై అవినీతి ఆరోపణలు.. వైసీపీని ఇబ్బందిపెడుతున్నాయ్. పెరిగిన ధరలు మరో వీక్‌నెస్‌గా మారాయ్‌. వైసీపీ కంటే టీడీపీనే బెటర్ అనుకునే పరిస్థితికి జనాలు వచ్చారన్న పరిస్థితి ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో కనిపిస్తోంది. దీంతో జగన్ ముందుగానే అలర్ట్ అయ్యారు. గడపగడకు అంటూ సంక్షేమాన్ని ప్రతీ ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీని అంతర్గత పోరు ఇబ్బంది పెడుతుండగా.. 2024లో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో యుద్ధం మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.