Tirumala : తిరుమలలో మళ్లీ కలకలం.. మరో రెండు చిరుతలను గుర్తించిన అధికారులు, కొనసాగుతున్న ఆపరేషన్ చీతా
రెండు నెలల కాలంలో ఏకంగా 5 చిరుతలను పట్టుకున్నారు. చిరుతల గణన సాధ్యం కాదంటున్నారు అధికారులు. Tirumala - Operation Cheetah

Tirumala - Operation Cheetah
Tirumala – Operation Cheetah : తిరుమలలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఇప్పటికే 5 చిరుతలను బంధించిన అటవీశాఖ అధికారులు మరో రెండింటి కదలికలను గుర్తించారు. మరో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాలో చూసి తెలుసుకున్నారు. స్పెషల్ టైప్ కాటేజీల సమీపంలో నరసింహ స్వామి ఆలయం ప్రాంతంలో చిరుతలు తిరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ రెండింటిని బంధించడానికి అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమలలో ఇవాళ(సెప్టెంబర్ 7) ఉదయం ఓ చిరుత బోనులో చిక్కింది. రెండు నెలల కాలంలో ఏకంగా 5 చిరుతలను పట్టుకున్నారు. అలిపిరి-తిరుమల నడకమార్గంలోని నరసింహ స్వామి ఆలయం 7వ మైలు వద్ద ప్రాంతంలో చిరుతను ట్రాప్ చేసి బంధించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతల సంఖ్య విషయంలో అధికారులు అంచనాకు రాలేకపోతున్నారు. చిరుతల గణన సాధ్యం కాదంటున్నారు అధికారులు.
తిరుమలలో చిరుతల కలకలం కొనసాగుతోంది. నడకదారిలో చిరుతల సంచారం భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే 5 చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకునే లోపు.. మరో రెండు చిరుతలు కనిపించడం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
Also Read..Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత.. నడకమార్గంలో చిరుతను బోనులో బంధించిన అధికారులు
తిరుమల స్పెషల్ టైప్ కాటేజీలు, నడకదారిలోని నరసింహస్వామి ఆలయం సమీపాల్లో మరో రెండు చిరుతలు ఉన్నట్లు ట్రాప్ కెమెరాల్లో ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. వాటిని బంధించేందుకు బోన్లను కూడా ఏర్పాటు చేశారు. రెండు నెలల వ్యవధిలో 5 చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు. అయితే మరో రెండు చిరుతలు ఉన్నట్లు ట్రాప్ కెమెరాలో గుర్తించడం తీవ్ర కలకలం రేపింది. టీటీడీ అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు చిరుతలను బంధించాల్సిన అవసరం ఉందంటున్నారు.
ఈవో బంగ్లా సమీపంలోని స్పెషల్ టైప్ కాటేజీల దగ్గర ఒక చిరుత సంచరిస్తోంది. అదే విధంగా నరసింహస్వామి ఆలయం దగ్గర మరో చిరుత సంచరిస్తోంది. మొత్తంగా శేషాచలం అటవీ ప్రాంతంలో ఎన్ని చిరుతలు ఉన్నాయి? అనే దానిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు అధికారులు. ఇంకా దాదాపుగా 40 చిరుతలు ఉండొచ్చని భావిస్తున్నారు. నడకదారికి అత్యంత సమీపంలోకి వచ్చే చిరుతలను మాత్రమే బంధిస్తున్నాము అని అధికారులు చెప్పారు.
చిరుతల సంచారం భయంతో భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. దీని ప్రభావం నడకదారిలో వెళ్లే భక్తుల సంఖ్యపై పడింది. నడకదారిలో వెళ్లే భక్తుల సంఖ్య తగ్గిందని చెప్పొచ్చు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నడకదారిలో వెళ్లే భక్తులకు ఊతకర్రలు ఇస్తున్నారు అధికారులు.