Tirumala : అక్టోబ‌రు 31 నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 31 నుండి న‌వంబ‌రు 2వ తేదీ వరకు ప‌విత్రోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.

Tirumala : అక్టోబ‌రు 31 నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు

Tirumala

Sri Kalyana Venkateswaraswamy : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 31 నుండి న‌వంబ‌రు 2వ తేదీ వరకు ప‌విత్రోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుగ‌నున్నాయని తెలిపింది. ఈ మేరకు టీటీడీ గురువారం (అక్టోబర్ 21, 2021)న ఒక ప్రకటన విడుదల చేసింది.

ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా అక్టోబరు 30వ తేదీన ఉద‌యం 7 గంట‌ల‌కు ఆచార్య రుత్విక్‌వ‌ర‌ణం, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వ‌ర‌కు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 31వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు.

corona vaccine : భారత్ మరో రికార్డు.. 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి

రెండో రోజు నవంబరు 1వ తేదీన మధ్యాహ్నం 12.00 నుండి 1.00 గంట వరకు పవిత్ర సమర్పణ చేస్తారు. చివరిరోజు నవంబరు 2వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల‌కు ఆల‌యంలో ఆస్థానం జ‌రుగ‌నుంది.