Pawan Kalyan : పొలిటికల్‌‌గా ఆ విషయంలో రూట్ మార్చిన జనసేనాని.. మొన్నటి దాకా వైట్ అండ్ వైట్ కానీ ఇప్పుడు..

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి వైట్ అండ్ వైట్ ఖద్దరు డ్రెస్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎప్పుడన్నా రెడ్ కలర్ ఖద్దరు డ్రెస్ లో కనిపించేవారు.

Pawan Kalyan : పొలిటికల్‌‌గా ఆ విషయంలో రూట్ మార్చిన జనసేనాని.. మొన్నటి దాకా వైట్ అండ్ వైట్ కానీ ఇప్పుడు..

Pawan Kalyan

Updated On : September 17, 2023 / 2:48 PM IST

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టుతో పవన్ కళ్యాణ్ తన రాజకీయాల్లో మరింత దూకుడు పెంచి తెలుగు దేశం(Telugu Desham) పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ తర్వాత షూటింగ్స్ కి మళ్ళీ బ్రేక్ ఇచ్చి రాజకీయంగా పవన్ మరింత బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల పవన్ రాజకీయాల్లో ఓ విషయంలో మాత్రం మార్పు వచ్చింది.

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి వైట్ అండ్ వైట్ ఖద్దరు డ్రెస్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎప్పుడన్నా రెడ్ కలర్ ఖద్దరు డ్రెస్ లో కనిపించేవారు. చాలా వరకు రాజకీయాలకు సంబంధించిన మీటింగ్స్, ప్రెస్ మీట్స్ కి ఖద్దరు, వైట్ అండ్ వైట్ డ్రెస్ లోనే వచ్చేవాళ్ళు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కొన్ని సినిమా ఈవెంట్స్ కి కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లోనే రాజకీయ నాయకుడిలా వచ్చారు.

కానీ గత కొన్ని రోజుల నుంచి ఈ విషయంలో తన పంథాని మార్చుకున్నారు. చంద్రబాబుని జైల్లో కలవడానికి వెళ్ళినప్పుడు బ్లూ జీన్స్, బ్లూ షర్ట్ వేసుకొచ్చారు. ఇక నిన్న మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో బ్లాక్ అండ్ బ్లాక్ జీన్స్, షర్ట్ వేసుకొచ్చారు. అలాగే ఇటీవల ఓ ప్రెస్ మీట్ కి కూడా నార్మల్ వైట్ షర్ట్ తో బ్లూ జీన్స్ వేసుకొచ్చారు. దీంతో పవన్ డ్రెస్సింగ్ ఇప్పుడు చర్చగా మారింది. ఇన్నాళ్లు సినిమాలకు కూడా వైట్ అండ్ వైట్ ఖద్దరు వేసుకెళ్లిన పవన్ ఇప్పుడేంటి రాజకీయాలకు కూడా ఇలా జీన్స్, కలర్ డ్రెస్ లు వేస్తున్నారు అని చర్చించుకుంటున్నారు.

Also Read : Daggubati Purandheswari : పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రియాక్షన్ ..

మరి పవన్ మనసులో ఏముందో, డ్రెస్సింగ్ ఎందుకు మార్చాడో ఆయనకే తెలియాలి. ఇలా పవన్ సడెన్ గా డ్రెస్సింగ్ మార్చడంతో ఈ విషయంలో కూడా పవన్ మరోసారి ట్రెండ్ అవుతున్నారు. ఇక చంద్రబాబు అరెస్ట్ తో పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ప్రస్తుతానికి సినిమా షూటింగ్స్ కి బ్రేక్ పడింది.