Pawan kalyan : జనసేనాని శ్రమదానంపై టెన్షన్..రోడ్లను బాగు చేస్తున్న అధికారులు

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ మీద పవన్ కళ్యాణ్ చేసే శ్రమదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోగా... అందుకు అనుమతి లేదని ఇరిగేషన్‌ ఎస్‌ఈ ప్రకటించారు.

Pawan kalyan : జనసేనాని శ్రమదానంపై టెన్షన్..రోడ్లను బాగు చేస్తున్న అధికారులు

Janasena

Sramadanam : జనసేన తలపెట్టిన శ్రమదానం కార్యక్రమంలో ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు  చోటు చేసుకుంటున్నాయి. మొదట ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ మీద పవన్ కళ్యాణ్ చేసే శ్రమదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోగా… అందుకు అనుమతి లేదని ఇరిగేషన్‌ ఎస్‌ఈ ప్రకటించారు. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుందన్న ఎస్‌ఈ.. అనుమతి కుదరదని తేల్చిచెప్పారు. దీంతో వేదికను రాజమండ్రి బాలాజీపేట-హుకుంపేట రోడ్డులో శ్రమదానం కార్యక్రమం చేపట్టాలని వేదిక మార్చారు. అయితే అక్కడ కూడా అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. రాజమండ్రి బాలాజీపేట-హుకూంపేట రోడ్డులో గుంతలు పూడ్చాలనుకున్నా.. జనసేనకు ట్విస్ట్ ఇచ్చారు అధికారులు.

Read More : AP Govt: కొత్త సీఎస్.. వచ్చీ రాగానే భారీగా ఐఏఎస్‌ల బదిలీ

బాలాజీపేట-హుకుంపేట మధ్య రోడ్డులోని గోతులను అధికారులు హుటాహుటిన పూడ్చివేయించారు. అంతకుముందు ధవళేశ్వరం బ్యారేజీపై కూడా గోతులను పూడ్చేశారు. జనసేన చేపట్టిన శ్రమదానానికి ఛాన్స్ ఇవ్వకుండా ముందే ప్రభుత్వం ప్రభుత్వం గుంతలను పూడ్చేస్తోంది. దీంతో జనసేన పార్టీ డైలామాలో పడింది. శ్రీకాకుళం జిల్లాలో కూడా శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్న జనసేనకు అక్కడి అధికారులు కూడా షాక్ ఇచ్చారు. ప్రైవేట్ వ్యక్తులు రోడ్డు మరమ్మతులు చేయడం నేరమని.. చట్టరిత్యా శిక్ష పడే అవకాశముందని స్పష్టం చేశారు. ఎవరైనా మరమ్మతుల పేరుతో కార్యక్రమాలు చేపడితే.. ప్రాపర్టీ డ్యామేజ్‌ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Read More : Anupama Parameswaran: బికినీ ఫోటో అడిగిన నెటిజన్.. అనుపమ ఏమందో తెలుసా?

ఇప్పటికే ప్రభుత్వానికి రోడ్ల మరమ్మత్తుల కోసం నివేదికలు పంపామని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు అధికారులు. అయితే పవన్ చీప్‌ పబ్లిసిటీ మానుకోవాలంటోంది అధికార పార్టీ.పవన్‌ కల్యాణ్  పర్యటించనున్న.. కొత్తచెరువు ఏరియాలో సందడి నెలకొంది. ఆ ప్రదేశమంతా.. జనసేన బ్యానర్లు, ప్లెక్సీలతో నిండిపోయింది. మూడు రోజుల నుంచి అక్కడే మకాం వేసిన జనసేన జిల్లా నాయకత్వం.. ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు జనసైనికులు. ప్రజలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడంతో.. ఏర్పాట్లు ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read More : Anaika Soti: అందాలతో చిత్రవధ చేస్తున్న అనైకా సోతీ!

పవన్ కళ్యాణ్ శ్రమ దానం చేసే ఈ ప్రాంతానికి సంబంధించి పోలీసుల నుంచి అనుమతులు మంజూరు కాలేదు. అయినా తగ్గేదే లే అంటూ లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకోవైపు గుంతల మయంగా ఉన్న రహదారులకు అధికారులు మరమ్మతులు చేయించి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. జనసైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటేనే అధికార యంత్రాంగంలో వణుకు పుట్టిందని, ఆయన వస్తున్నాడనే  దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాగైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.