AP Govt: కొత్త సీఎస్.. వచ్చీ రాగానే భారీగా ఐఏఎస్‌ల బదిలీ

ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1985 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన డాక్టర్‌ సమీర్‌శర్మ తాజాగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

AP Govt: కొత్త సీఎస్.. వచ్చీ రాగానే భారీగా ఐఏఎస్‌ల బదిలీ

Ap Govt (1)

AP Govt: ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1985 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన డాక్టర్‌ సమీర్‌శర్మ తాజాగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. సీఎస్‌గా పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్‌దాస్‌ స్థానంలో నూతన బాధ్యతలు చేపట్టిన సమీర్ శర్మ వచ్చీ రాగానే భారీగా అధికారుల బదిలీలు మొదలు పెట్టారు. శుక్రవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించడం.. అనంతరం అధికారుల బదిలీలపై దృష్టి పెట్టారు.

దీంతో శుక్రవారం ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా గిరిజా శంకర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గా కోన శశిధర్, దేవాదాయశాఖ కమిషనర్ గా హరి జవహర్ లాల్ నియమితులు కాగా ఆర్&ఆర్ కమిషనర్ గా జే.శ్యామలరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఇక వైద్యారోగ్య ప్రత్యేక కార్యదర్శిగా నవీన్ కుమార్ ను నియమించారు. ఈ మేరకు నూతన నియామకాలు, బదిలీలకు సంబంధించి కొత్త చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ నియామక ఉత్తర్వులు జారీచేశారు. సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ ఈరోజే బాధ్యతలు స్వీకరించగా ఈరోజే ఐఏఎస్ ల బందీలు చేపట్టడం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తిగా మారింది.