Perni Nani: టీడీపీ నేత నారా లోకేశ్‌ను కోడిగుడ్లతో కొట్టింది వీరే.. : పేర్ని నాని

నారా లోకేశ్‌పై పలువురు కోడిగుడ్లు విసిరిన ఘటనపై పేర్ని నాని స్పందించారు.

Perni Nani: టీడీపీ నేత నారా లోకేశ్‌ను కోడిగుడ్లతో కొట్టింది వీరే.. : పేర్ని నాని

YCP MLA Perni Nani

Updated On : June 9, 2023 / 3:45 PM IST

Perni Nani – Nara Lokesh: టీడీపీ (TDP) వారే తమకు సెల్ఫీ ఇవ్వలేదని నారా లోకేశ్‌ను కోడిగుడ్లతో కొట్టారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పాదయాత్ర చేస్తోన్న నారా లోకేశ్ ప్రజా ప్రతినిధి కూడా కాదని చెప్పారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తన కుమారుడికి భద్రత కరవైందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగానే ప్రభుత్వం భద్రత ఇచ్చిందని చెప్పారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని పేర్ని నాని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేశారని చెప్పుకొచ్చారు. సీపీఎస్ విధానంలో ఉద్యోగికి 400 రూపాయలు పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేదని చెప్పారు.

సీపీఎస్ ను రద్దు చేస్తానని మచిలీపట్నంలో పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారని పేర్ని నాని గుర్తు చేశారు. సీపీఎస్ ను రద్దు చేసి జీపీఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలిపారు. పే కమిషన్ వేసేందుకు గతంలో ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఉండేదని చెప్పారు. రోడ్డెక్కి ఉద్యమం చేయనిదే గతంలో ఏ ప్రభుత్వమూ పీఆర్సీ కమిటీ నియామకం చేయలేదని అన్నారు.

Minister Harish rao : మెడికల్ కాలేజీలు మేం ఏర్పాటు చేస్తే ..అది బీజేపీ ఘనత అని చెప్పుకోవటం సిగ్గు చేటు..