YS Viveka Murder Case: వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి చెప్పినవన్నీ నిజాలే.. పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారు: సీబీఐ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతా రెడ్డి చెప్పినవన్నీ నిజాలే అని, రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం విచారణ జరగనుంది.

YS Viveka Murder Case: వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి చెప్పినవన్నీ నిజాలే.. పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారు: సీబీఐ

YS Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి చెప్పినవన్నీ నిజాలే అని సుప్రీంకోర్టుకు తెలిపింది సీబీఐ. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే.

Women’s IPL: త్వరలో మహిళల ఐపీఎల్.. అంగీకరించిన బీసీసీఐ.. వచ్చే మార్చి నుంచే ప్రారంభం

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఆంధ్ర ప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని, సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం కోర్టులో విచారణ జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక విషయాల్ని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ ప్రకారం.. కేసులో నిందితులు.. దర్యాప్తు విచారణాధికారిపైనే తిరిగి కేసులు పెట్టారు. మేజిస్ట్రేట్ ముందు 164 స్టేట్‌మెంట్ ఇస్తామన్న పోలీసు అధికారి శంకరయ్యకు ఏపీ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత శంకరయ్య.. తనపై సీబీఐ ఒత్తిడి తెచ్చి, 164 స్టేట్‌మెంట్ అడిగినట్లు లేఖ రాశారు. రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారు.

Woman Bank Manager: బ్యాంకు దోపిడీకి కత్తితో వచ్చిన దుండగుడు.. మహిళా మేనేజర్ ఎలా పోరాడిందో చూడండి.. వైరల్ వీడియో

అందుకే విచారణలో జాప్యం జరుగుతోంది. హత్య జరిగిన తర్వాత నిందితులు చెప్పినట్లుగా స్థానిక పోలీసులు వ్యవహరించారు. నిందితుల్ని విచారణ జరిపి, చార్జిషీటు దాఖలు చేయాల్సిన పోలీసులు.. చార్జిషీటు ఆలస్యం చేసి వారికి సహకరించారు అని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొంది. దీనిలో అన్ని అంశాల్ని పూర్తిగా వివరించినట్లుగా సమాచారం. కాగా, సునీతా రెడ్డి వాదనలు అన్నింటికీ సీబీఐ మద్దతు తెలిపింది.