Ayyanna Patrudu: ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుంది: చింతకాయల రాజేష్

అయ్యన్న రాజమండ్రిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఈ విషయాన్ని పోలీసులకు తెలిపినా వారు రెండు రోజుల నుంచి మా ఇంటి వద్దనే తిష్ట వేశారని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు

Ayyanna Patrudu: ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుంది: చింతకాయల రాజేష్

Ayyana Patrudu

Ayyanna Patrudu: అధికార వైసీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధింపుగా ఎన్ని కేసులు పెట్టినా.. ప్రభుత్వంపై తమ పోరాటం సాగుతుందని నర్సీపట్నం 25 వార్డు కార్పోరేటర్, తెలుగుదేశం నేత చింతకాయల రాజేష్ అన్నారు. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడికి పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల నుంచి వచ్చిన పోలీసులు నోటీసులు ఇచ్చారు. రెండు రోజులుగా నర్సీపట్నంలోని అయ్యన్న పాత్రుడి నివాసం వద్ద భైఠాయించి..ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు. అయ్యన్న పాత్రుడు కుమారుడు రాజేష్.. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నల్లజర్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని.. ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిపోయారని రాజేష్ తెలిపారు. నోటీసుల ప్రకారం విచారణను నిలిపివేస్తూ గురువారం హైకోర్ట్ నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయి.

Also Read: KCR: మల్లన్న సాగర్ సాక్షిగా.. కేసీఆర్ శపథం

ఈనేపధ్యంలో చింతకాయల రాజేష్ మీడియాతో మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగోలేదు ఆయన రాజమండ్రిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపినా వారు రెండు రోజుల నుంచి మా ఇంటి వద్దనే తిష్ట వేశారని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు విచారణను నిలిపివేస్తూ కోర్టు నుంచి ఉత్తర్వులు రావడంతో తిరిగి వెళ్లిపోయారని రాజేష్ పేర్కొన్నారు. అయితే తమను బెదిరించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయని.. రెండు రోజులుగా మా కార్యకర్తలు వెన్నంటే ఉండి ఆత్మరక్షణగా నిలిచారని రాజేష్ అన్నారు.

Also read: Viveka murder case: వివేకా కేసులో ఊహించని ట్విస్టులు

బలమైన బీసీ నేత అయిన అయ్యన్న పాత్రుడుకి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి.. ప్రభుత్వంపై అయిన చేస్తున్న విమర్శలు ప్రజల్లోకి వెళ్తున్నాయని అక్కసుతోనే ప్రభుత్వం పదేపదే కేసులు పెట్టి వేధిస్తోందని రాజేష్ ఆరోపించారు. “అయ్యన్నపాత్రుడు అసభ్య పదజాలాన్ని ఉపయోగించారని చెప్తారు కానీ మంత్రులుగా ఉన్న కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, అప్పల రాజులు మాట్లాడిన భాషను ఏమంటారని రాజేష్ ప్రశ్నించారు. ఇలా ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుందని రాజేష్ వెల్లడించారు.

Also read: Ayyannapatrudu: ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద ఉద్రిక్తత