Rare Coral Reefs In Ap Coastal : ఏపీలోని పూడమడిక సముద్ర తీరంలో గుర్తించిన పగడపు దిబ్బల ప్రత్యేకత ఏంటి ?

ఏపీలోని పూడమడిక సముద్ర తీరంలో గుర్తించిన పగడపు దిబ్బలు చాలా ప్రత్యేకం అంటున్నారు ZSI సైంటిస్టులు. అంత ప్రత్యేకత వీటిలో ఏముంది.. శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడిన కీలక విషయాలు ఏంటి..?

Rare Coral Reefs In Ap Coastal : ఏపీలోని పూడమడిక సముద్ర తీరంలో గుర్తించిన పగడపు దిబ్బల ప్రత్యేకత ఏంటి ?

Rare Coral Reefs In Ap Coastal (3)

Rare Coral Reefs Found In Ap Coastal : పూడమడిక సముద్ర తీరంలో గుర్తించిన పగడపు దిబ్బలు చాలా ప్రత్యేకం అంటున్నారు ZSI సైంటిస్టులు. అంత ప్రత్యేకత వీటిలో ఏముంది.. శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడిన కీలక విషయాలు ఏంటి.. మరింత లోతుగా పరిశోధన జరిపితే.. మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉందా.. సైంటిస్టులు ఏమంటున్నారు..

సాధారణంగా ఒక చోట ఉన్న పగడపు దిబ్బలను తీసి.. మరో ప్రాంతంలో చేర్చితే.. అవి వాటి సహజత్వాన్ని కోల్పోతాయ్. ఐతే పూడిమడిక ప్రాంతంలో పెరిగే పగడపు దిబ్బలు మాత్రం చాలా ప్రత్యేకం. ఇక్కడి కోరల్‌ లీఫ్స్‌లో కొంత భాగం తీసి.. మరోచోట పెంచే అవకాశం ఉంటుంది. అందుకే ఇవి అరుదైనవని జువలాజికల్‌ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు అంటున్నారు. ఈ తరహా పగడపు దిబ్బలు.. మేరీటైమ్‌ మెడిసిన్‌ తయారీకీ ఉపయోగపడతాయని గుర్తించారు.

Also read : Rare Coral Reefs In Ap Coastal : ఉత్తరాంధ్ర తీరంలో అరుదైన పగడపు దిబ్బలు గుర్తించిన పరిశోధకులు

మూడు సంవత్సరాల పాటు.. ఏటా తొమ్మిదిరోజులు ఆ బీచ్‌ల్లో సబ్ టైడల్, ఇంటర్‌ టైడల్‌ ప్రాంతాల్లో సైంటిస్టులు సర్వే నిర్వహించారు. విభిన్న జీవరాశులకు సంబంధించిన నమూనాలు సేకరించారు. 15వందల 97 మొలస్కా జాతులు, 182 సిని డారియన్, 161 స్పాంజ్, 133 రకాల చేపలు, 106 క్రస్టేసియన్లు, 12 అసిడియన్లు, 3 ఫ్లాట్‌వార్మ్‌లతో పాటు.. అన్నెలిడ్‌ జీవజాతుల నమూనాలను సేకరించారు. సముద్రగర్భంలో పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలుగా.. పగడపు దిబ్బలను పిలుస్తారు. పగడాల ద్వారా స్రవించే కాల్షియం కార్పొనేట్‌ నిర్మాణాలతో ఇవి ఏర్పడతాయ్. ఇవి కొన్ని పోషకాలను కలిగి ఉంటాయ్‌. పగడపు దిబ్బలు సముద్రగర్భంలో అత్యంత వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. ఇవి ఉంటే.. సముద్ర జీవరాశులు ఎక్కువగా పెరిగేందుకు ఉపయోగపడతాయి.

విదేశీ తీరాల్లో కనిపించే సూక్ష్మజాతి సముద్ర జీవరాశులు కూడా పూడిమడకలో ఉన్నట్లుగా గుర్తించారు. భిన్నమైన జీవజాలంతో పూడిమడక తీరం అద్భుతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నివేదికలో తెలిపారు. పీత జాతికి చెందిన అరుదైన తెనస్, స్పాంజ్, స్టార్‌ఫిష్… ఇండో పసిఫిక్‌ సముద్రంలో ఉండే స్టోమోప్నిస్టెస్‌ సముద్రపు ఆర్చిన్‌లు, సీ బటర్‌ఫ్లైస్‌గా పిలిచే హెనియోకస్‌ చేపలు, ఒంటెరొయ్యలు.. ఇలా భిన్నమైన జీవజాలంతో పూడిమడక తీరం అద్భుతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నివేదికలో పొందుపరిచారు. దీంతో వచ్చే ఏడాది మరోసారి లోతైన అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి రీఫ్స్‌, కోరల్స్ ద్వారా మత్స్యసంపద చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. ఐతే కాలుష్యం బారిన పడకుండా వీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

Also read : Chandrababu Naidu: ఏపీ సీఎం జగన్‌పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

సముద్రపు అడుగుభాగంలో కొంత భాగాన్నే ఆక్రమించిన పగడపు దీవుల వల్ల.. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా జనాలు నేరుగా ప్రయోజనం పొందుతున్నారు. అయితే వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా పగడపు దిబ్బలకు ప్రమాదం పొంచి ఉంది. 2009 తర్వాతి నుంచి ఇప్పటివరకు పగడపు దిబ్బల్లో 14శాతం కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదిక తెలుపుతోంది. ఇలాంటి సమయంలో ఉత్తరాంధ్ర తీరంలో గుర్తించిన పగడపు బిబ్బలను మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టుతో పూడిమడిక ప్రాంతం టూరిస్టు కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయ్. ఇక అదే సమయంలో ఈ పగడపు దిబ్బలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. పూడిమడికలోనే కాదు.. ZSI సైంటిస్టులు రహస్యాలను వరుసగా బయటపెడుతున్నారు. శ్రీకాకుళంలోని చింతపల్లి ప్రాంతంలోనూ విభిన్నమైన సముద్ర జాతులను గుర్తించారు.