ఏపీలో పేదల ఇళ్ల వద్దకే రేషన్.. వాహనాలు ఇవే.. పరిశీలించిన మంత్రులు

  • Published By: vamsi ,Published On : June 20, 2020 / 01:13 AM IST
ఏపీలో పేదల ఇళ్ల వద్దకే రేషన్.. వాహనాలు ఇవే.. పరిశీలించిన మంత్రులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామవాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన ప్రభుత్వం. వారి ద్వారానే రేషన్ ప్రతీ పేదింటికి ఇప్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే బియ్యం, ఇతర సరుకులను ఇంటి ముందుకే తీసుకువచ్చి వలంటీర్ల సాయంతో పంపిణీ చేయాలని సీఎం జగన్ సర్కారు నిర్ణయించింది.

ఈ విధమైన పంపిణీకి అనువైన వాహనాన్ని సర్కారు రూపొందించగా.. ఈ వాహనం ద్వారా నిత్యావసరాల పంపిణీ ట్రయల్ రన్‌ను కూడా నిర్వహించారు అధికారులు, మంత్రులు. 

ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, రాష్ట్ర ఆర్థికమంతి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు పరిశీలించారు. ప్రజా పంపిణీ పారదర్శకంగా ఉండాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమని ఈ సంధర్భంగా కొడాలి నాని చెప్పుకొచ్చారు. 

ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా ఉండాలనేది మా ప్రభుత్వ ధ్యేయం సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు పేదల గుమ్మం ముందుకే నిత్యావసర సరుకులు పంపిణీ చేసేలా రూపొందించిన వాహనాన్ని ఆర్థికమంత్రి బుగ్గన, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు గార్లతో కలిసి పరిశీలించడం జరిగింది.  

Read:  ప్రధాని మీద నమ్మకం వుంది… చైనా ఘర్షణలకు పరిష్కారం కనుగొంటారు.. YS జగన్