Guntur : చిన్న పట్టణాల్లోకి విస్తరించిన..రేవ్ కల్చర్

పార్టీలు శృతి మించిపోతున్నాయి. పేరు బర్త్ డే పార్టీ..అయితే ఇక్కడ జరిగేది మరోటి. వేడుకలకు వచ్చే వారికి మస్తు..మస్తుగా ఎంజాయ్ చేసేందుకు వీలుగా..కొంతమంది రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. అయితే..మొన్నటి వరకు నగరాల్లో ఉన్న ఈ కల్చర్..తెలుగు రాష్ట్రాల్లోని చిన్న చిన్న పట్టణాలకు కూడా పాకుతుండడం కలవర పెడుతోంది.

Guntur : చిన్న పట్టణాల్లోకి విస్తరించిన..రేవ్ కల్చర్

Rave Party

Rave party : కరోనా కాలంలో పార్టీలు, ఫంక్షన్ లు నిర్వహిస్తున్నారు. అయితే..కొన్ని పార్టీలు శృతి మించిపోతున్నాయి. పేరు బర్త్ డే పార్టీ..అయితే ఇక్కడ జరిగేది మరోటి. వేడుకలకు వచ్చే వారికి మస్తు..మస్తుగా ఎంజాయ్ చేసేందుకు వీలుగా..కొంతమంది రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. అయితే..మొన్నటి వరకు నగరాల్లో ఉన్న ఈ కల్చర్..తెలుగు రాష్ట్రాల్లోని చిన్న చిన్న పట్టణాలకు కూడా పాకుతుండడం కలవర పెడుతోంది.

ఇతర నగరాల నుంచి యువతులను రహస్యంగా రప్పించి..వారితో అసభ్యనృత్యాలు చేయిస్తున్నారు. మందు, విందు ఉండడంతో మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా యువతే ఎక్కువగా ఉంటోంది. భారీగా ఖర్చు చేస్తూ…జల్సాలు చేస్తున్నారు. తాజాగా..గుంటూరులో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తన పుట్టిన రోజు కోసం…ఏకంగా కాల్ గర్ల్స్ ను రప్పించడం అందర్నీ ఉలిక్కిపాటుకు గురి చేసింది.

జిల్లాలోని అరండల్ పేటకు చెందిన ఓ వ్యక్తి స్థానికంగా ఓ హోటల్ ను బుక్ చేసుకున్నాడు. అక్కడ స్నేహితులకు బర్త్ డే పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకను మరింత ఆకట్టుకొనేందుకు అతడి స్నేహితులు ఏకంగా బెంగుళూరు నుంచి కాల్ గర్ల్స్ రప్పించారు. అంతా కలిసి..హోటల్ లో పార్టీ చేసుకుంటున్నారు. ఈ విషయం పొక్కకుండా నిర్వాహకులు జాగ్రత్త పడ్డారు. అయితే..ఈ విషయం ఆనోటా..ఈ నోటా పాకింది.

ఇంకేముంది. రేవ్ పార్టీలో గానా..బజానా బదులు పోలీసు బూట్ల చప్పులు వినిపించాయి. హోటల్ పై దాడులు నిర్వహించారు. వేడుకల్లో ముగ్గురు కాల్ గర్ల్స్ తో పాటు అందర్నీ అదుపులోకి తీసుకున్నారు. కేసు బుక్ చేశారు. బర్త్ డే బాయ్ తో పాటు..అతడి స్నేహితులను విచారిస్తున్నారు. హోటల్ పై కూడా కేసు నమోదు చేశారు.