Registrations : ఇక సచివాలయాల్లోనే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇకపై సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. త్వ‌ర‌లో గ్రామ‌, వార్డు స‌చివాలయాల్లో రిజిస్ట్రేష‌న్ సేవ‌లు ప్రారంభించే

Registrations : ఇక సచివాలయాల్లోనే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Registrations

Registrations : ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇకపై సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. త్వ‌ర‌లో గ్రామ‌, వార్డు స‌చివాలయాల్లో రిజిస్ట్రేష‌న్ సేవ‌లు ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఎంపిక చేసిన 51 గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లోనే భూములు, ఆస్తుల రిజిస్ట్రేష‌న్లు జ‌రుగుతాయ‌ని ప్రభుత్వం తెలిపింది.

Paytm బంపర్ ఆఫర్.. 100 శాతం క్యాష్‌బ్యాక్, కండీషన్స్ అప్లయ్

పార‌ద‌ర్శ‌క‌త కోస‌మే గ్రామ‌స్థాయిలో రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌బోతున్న‌ట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం గ్రామ కార్య‌ద‌ర్శుల‌కు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌పై ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌నుంది ప్రభుత్వం. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ, పట్టణాల్లో వార్డు సెక్రటరీలకు రిజిస్ట్రేషన్లు చేసేలా ప్రభుత్వం అధికారం కల్పించింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ఆరు నెలల పాటు పంచాయతీ, వార్డు సెక్రటరీలకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సాధ్యమైనంత త్వరగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది.

గ్రామ వార్డు సచివాలయాల్లో త్వరితగతిన రిజిస్ట్రేషన్ సేవల ప్రారంభంపై దృష్టి సారించాలని రాష్ట్ర రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ అన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలన్న తలంపుతోనే సీఎం జగన్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు.

Malware ముప్పు.. బ్యాంకు యూజర్లకు వార్నింగ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ

సచివాలయంలోని తన ఛాంబర్ లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. ప్రత్యేకించి గ్రామ స్దాయిలో రిజిస్ట్రేషన్లు అన్న అంశంపై లోతుగా చర్చించారు. ప్రజల ఇంటి దగ్గరకే వివిధ ప్రభుత్వ సేవలను అందించాలన్న లక్ష్యం మేరకు విభిన్న విభాగాల మధ్య సమన్వయం సాధించటానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని రజత్ భార్గవ అన్నారు. 1908 రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 6ను అనుసరించి నిర్ధేశించిన 51 గ్రామ సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సేవలు అందించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ రజత్ భార్గవ అధికారులను కోరారు. రిజిస్టేషన్ల ప్రక్రియలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సచివాలయ కార్యదర్శులకు అవసరమైన పూర్తి స్దాయి శిక్షణను అందించాలని ..ఇందుకు అవసరమైన కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చారు. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలను సీఎం జగన్ మానస పుత్రికలుగా భావిస్తారు. దేశం మొత్తం మీద ఈ వ్యవస్థలు ఉన్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ చేరవేయాలనే సంకల్పంతో, కేవలం 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను జగన్ సర్కారు నియమించింది. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా తనకు ఓటెయ్యకపోయినా అర్హత ఉంటే పథకాలు వర్తింపజేయాలని జగన్ స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నారు. ప్రజలకు ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా, ఇంటి దగ్గరే సేవలు అందేలా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు సీఎం జగన్ తెలిపారు.