Objections : ఏపీలో కొత్త జిల్లాలపై అభ్యంతరాలు

తూర్పుగోదావరి ఏజెన్సీలో భాగమైన రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలపడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కోనసీమ జిల్లాలో చేర్చడంపై అసంతృప్తిగా ఉన్నారు.

Objections : ఏపీలో కొత్త జిల్లాలపై అభ్యంతరాలు

New Districts

objections on new districts : ఏపీలో ఉగాది నుంచి 26 జిల్లాలు అమల్లోకి వస్తాయని ప్రకటించిన గంటల్లోనే.. అన్ని ప్రాంతాల నుంచి అభ్యర్థనలు, అభ్యంతరాలు రావడం మొదలైంది. తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా చేయాలని ఒక చోట.. తమ నియోజకవర్గాన్ని.. వేరే జిల్లాలో కలపాలని మరో చోట ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ డివిజన్ మార్చాలని కొందరు.. తాము చెప్పినట్లే.. జిల్లాను ఏర్పాటు చేయాలని ఇంకొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

తూర్పుగోదావరి ఏజెన్సీలో భాగమైన రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలపడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కోనసీమ జిల్లాలో చేర్చడంపై రామచంద్రాపురం, మండపేట వాసులు అసంతృప్తిగా ఉన్నారు. కృష్ణా జిల్లాలోనూ.. కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలను ఏలూరు జిల్లాలో కలపడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. గుడివాడ, పామర్రును.. మచిలీపట్నంలో ఉంచి, విజయవాడను ఎన్టీఆర్ జిల్లాగా మార్చడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Karimnagar Vaccination : వ్యాక్సినేషన్ లో కరీంనగర్ రికార్డు.. రెండో డోసు పంపిణీ వంద శాతం పూర్తి

పల్నాడు జిల్లాలో నరసరావుపేటను.. జిల్లా కేంద్రంగా చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. చీరాల రెవెన్యూ డివిజన్‌ను బాపట్లలో కలపడంపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక.. బాపట్ల జిల్లాలో చేర్చడంపై సంతనూతలపాడు వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రాయచోటి హెడ్ క్వార్టర్‌గా.. అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. చిత్తూరు జిల్లాలో మదనపల్లెను జిల్లాగా ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని.. మదనపల్లె జిల్లా సాధన సమితి నాయకులు హెచ్చరించారు.