Petrol-Tomato Prices : పెట్రోల్, టమాటా ధరల రన్నింగ్ రేస్..చుక్కలు చూపిస్తున్నాయిగా..

పెట్రోల్, టమాటా ధరల రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయా అన్నట్లుగా ఉంది. రెండూ రూ.100 దాటే ఉన్నాయి ధరల్లో. ఏపీలో టమాట రూ.108 అమ్ముతోంది.

Petrol-Tomato Prices : పెట్రోల్, టమాటా ధరల రన్నింగ్ రేస్..చుక్కలు చూపిస్తున్నాయిగా..

Tomato And Petrol Price

Updated On : November 23, 2021 / 5:31 PM IST

Rising petrol and tomato prices : అసలే పెట్రోలు, డిజీల్ ధరలు జనాలకు చెమటలు పట్టిస్తుంటే..నేనేమన్నా తక్కువా అంటోంది టమాటా. తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు రూ.108కి తగ్గనంటోంది. మరోవైపు టమాటా కూడా కిలో రూ.100 దాటిపోతోంది. టమాటాలు సగటున కిలో రూ.104 అమ్ముతోంది ఏపీలో. ప్రతీరోజు ఉప్మాతో సహా ఏదోరకంగా వాడే టమాటా కూరల్లోను కనపించట్లేదు. సాంబార్ లో టమాటా జాడే లేదు.

మరోపక్క పెట్రలో ధరలు కూడా అలాగే ఉన్నాయి. తెలంగాణలో లీటరు పెట్రోలు రూ.108 అమ్ముతోంది. ఏపీలో అంతకు మించే ఉంది. ఇక పోతే టమాట గత కొన్ని రోజులుగా కొండ దిగి వచ్చేది లేదంటోంది. టమాటా కొనాలంటేనే జనాలు హడలిపోతున్నారు. ఇక రెస్టారెంట్స్ లోను..ఆన్ లైన్ ఫుడ్ డెలివరీల్లో టమాట వెరైటీలకు ఎక్స్ ట్రా బిల్లులు వేస్తున్నారు.ఏపీలో కిలో టమాట గరిష్ఠంగా రూ.130 పలికింది. మంగళవారం (నవంబర్ 23,2021) సగటున కిలో టమాట రూ.104కు అమ్ముడవుతోంది.

టిఫిన్ సెంటర్లలో కూడా ఇడ్లీ దోసెల్లోకి టమాట చట్నీ మచ్చుకి కూడా కనిపించట్లేదు.పావు కిలో టమాటలను కొనేబదులు.. అదే రేటుకు రెండు మూడు రకాల ఆకు కూరలు వస్తాయని వినియోగదారులు వాపోతున్నారు. రెండు నెలల క్రితం వరకు కిలో టమాట కేవలం రూ.10 ఉండేది. మహా అయితే రూ.20 ఉండేది. కానీ ఒకేసారి చుక్కలంటేసింది ధర. 10 రెట్లు పెరిగి సామాన్యుడికి అందనంత ఎత్తులో కూర్చుంది.

తుపానులతో కురుస్తున్న భారీ వర్షాలు.. ట్రాన్స్ పోర్ట్ కు ఆటంకాలు..దీనికి తోడు పెట్రోల్ ధరలు పెరగటంతో ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కూడా పెరిగి వెరసి టమాటల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అలాగే మిగిలిన కూరగాయల ధరలూ కూడా తక్కువేం కాదు. దీనికి కారణం పెట్రోల్, డిజిల్ ధరలే కారణం.