Rivers Link : గోదావరి -కావేరీ అనుసంధానం.. ఓకే చెప్పిన తెలుగు రాష్ట్రాలు.. కండీషన్స్ అప్లయ్

గోదావరి-కావేరీ నదుల అనుసంధానంలో తొలి అడుగు పడింది. నదుల అనుసంధానికి తెలుగు రాష్ట్రాలో ఓకే చెప్పాయి. అయితే పలు కండీషన్స్ పెట్టాయి.

Rivers Link : గోదావరి -కావేరీ అనుసంధానం.. ఓకే చెప్పిన తెలుగు రాష్ట్రాలు.. కండీషన్స్ అప్లయ్

Rivers Interlinking

Rivers Link : గోదావరి-కావేరీ నదుల అనుసంధానంలో తొలి అడుగు పడింది. నదుల అనుసంధానికి తెలుగు రాష్ట్రాలో ఓకే చెప్పాయి. అయితే పలు కండీషన్స్ పెట్టాయి. గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై 5 రాష్ట్రాలు తమ తమ వాదనలు వినిపించాయి. గోదావరిలో మిగులు జలాల లభ్యతపై తాజాగా మరోసారి అధ్యయనం చేయాలని తెలంగాణ చెప్పింది. మిగులు జలాల లెక్క తేలిన తర్వాతే తరలింపు చేపట్టాలంది. నదుల అనుసంధానానికి తాము విముఖం కాదని, అయితే తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలగకూడదని తెలంగాణ అధికారులు చెప్పారు.

నదుల అనుసంధానికి విధానపరంగా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నుంచి అనుసంధానం చేపట్టాలని, తద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఏపీ వెల్లడించింది. నదుల అనుసంధానంతో ప్రయోజనం పొందే తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రాల నుంచి పూర్తి మద్దతు లభించింది. కాగా, నదుల అనుసంధానంతో తమకు ప్రత్యక్షంగా కలిగే ప్రయోజనం ఏంటో చెప్పాలని కర్నాటక అడిగింది.

Rivers Link, 5 States Express Their Views On Godavari Cauvery Rivers Interlinking

River Connectivity

గోదావరి- కావేరి నదుల అనుసంధానంపై ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌ డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి జలశక్తిశాఖ, ఎన్‌డబ్ల్యూడీఏ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి అధికారులు హాజరయ్యారు. జల‌శ‌క్తి శాఖ కార్య‌ద‌ర్శి పంక‌జ్ కుమార్‌, నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ చైర్మ‌న్ వెదిరె శ్రీ‌రాం నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఏపీ త‌రుఫున స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ జ‌వ‌హ‌ర్ రెడ్డి, ఈఎన్సీ నారాయణ రెడ్డి.. తెలంగాణ నుంచి ఇంజినీర్లు సుబ్రహ్మణ్య ప్రసాద్, మోహన్ కుమార్ హాజరయ్యారు.

River linking: నదుల అనుసంధానం వేగవంతం.. కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం

ఇచ్చంప‌ల్లి దగ్గర నీటి ల‌భ్య‌త లేద‌ని రెండు తెలుగు రాష్ట్రాలు తెలిపాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) సైతం నీటి ల‌భ్య‌త లేద‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. నీటి ల‌భ్య‌త‌పై ముందుగా అధ్య‌య‌నం చేయాల‌ని తెలుగు రాష్ట్రాల డిమాండ్‌ చేశాయి. దీంతో ఇచ్చంప‌ల్లి దగ్గర నీటి ల‌భ్య‌తపై కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ‌ రీ స్ట‌డీ చేయ‌నుంది. దీని వల్ల నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ప్రాజెక్టుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు స్పష్టం చేశాయి. గోదావ‌రి ట్రిబ్యున‌ల్ అవార్డు ప్రకారం వాటా వినియోగం పూర్తిగా జ‌ర‌గాలని సూచించాయి.

Rivers Link, 5 States Express Their Views On Godavari Cauvery Rivers Interlinking

Rivers Interlinking

నదుల అనుసంధానానికి అనుకూలమేనని, అయితే త‌మ రాష్ట్ర అవ‌స‌రాలు, ప్రాజెక్టులకు ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌ని ఏపీ స్పష్టం చేసింది. వ‌ర‌ద జ‌లాల‌నే వినియోగిస్తామ‌న్న‌ కేంద్రం ప్ర‌తిపాద‌న నేప‌థ్యంలో పోల‌వ‌రం నుంచి లింక్ చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న చేసింది. పోల‌వ‌రం నుంచి తీసుకుంటే బొల్లాప‌ల్లి దగ్గర అడిష‌న‌ల్ స్టోరేజీకి అవ‌కాశం ఉంటుందని చెప్పింది. పోల‌వ‌రం – బొల్లాప‌ల్లి- బ‌న‌క‌చ‌ర్ల‌- వెలుగోడు- తెలుగుగంగ లింక్ ద్వారా అనుసంధానం చేసే అంశాన్ని ప‌రిశీలించాల‌ని ఏపీ కోరింది. ఇందుకోసం ప్ర‌స్తుత‌మున్న కెనాల్‌ సిస్ట‌మ్ వాడుకునే అవ‌కాశముంద‌ంది.

గోదావరి -కావేరీ నదుల అనుసంధానికి తొలి అడుగు పడింది. ఐదు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అన్ని రాష్ట్రాలే ఓకే అంటున్నా తమ నీటి హక్కులకు భంగం కలిగించవద్దని తేల్చి చెప్పాయి. గోదావరి-కావేరి నదుల అనుసంధానం అంశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసమే సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో మ‌రిన్ని స‌మావేశాలు జరగనున్నాయి. 5 రాష్ట్రాలు స‌హ‌క‌రిస్తే కెన్‌-బెత్వా లింక్ త‌ర‌హాలో గోదావ‌రి-కావేరికి 90 శాతం నిధులు ఇచ్చే ఆలోచ‌న‌లో కేంద్రం ఉంది. మరోవైపు, జాతీయస్థాయిలో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు సానుకూల దృక్పథంతో ముందుకు రావాలని జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ కోరారు.

దిల్లీ: నదుల అనుసంధానంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న కీలకమైన రెండు నదులను అనుసంధానం చేయాలని సంకల్పించింది. మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం తొలుత భావించించింది. అయితే, ప్రస్తుతం గోదావరి- కావేరి అనుసంధానంపై కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది.